వీడియోలు కావాలని వదిలారా?

చోటా హీరోయిన్లు, సినిమా అవకాశాల కోసం ప్రయత్నించే ఒకరిద్దరి వీడియోలు మాత్రమే వున్నాయని వినిపిస్తోంది.

సినిమా తారల నగ్న వీడియోలు వున్న హార్డ్ డిస్క్ పోలీసులకు చిక్కింది అనే వార్తలు వైరల్ అయ్యాయి. ఎవరి వీడియోలు అని ఆరా తీయడం మొదలైంది. ఇది ఓ కోణం. అసలు ఈ హార్డ్ డిస్క్ వార్త నిన్నటికి నిన్న బయటకు రావడం, కొన్ని రసవత్తర వీడియోలు కొన్ని చానెళ్లకు లీక్ కావడం మీద డిస్కషన్ మరో కోణం.

రాష్ట్రంలో రాజకీయ వేడి చాలా ఎక్కువగా వుంది. కులాల సర్వే తప్పుల తడక అంటూ ఆరోపణలు, కులాల కుమ్ములాటలు, ఒకటి కాదు.. నానా హడావుడిగా వుంది. ఈ మొత్తం గడబిడ వార్తల్లో హైలైట్ కాకుండా చేయడానికే ఈ హార్డ్ డిస్క్ వార్త బయటకు వచ్చిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ మేరకు కొందరు ఆరోపణలు కూడా చేసేసారు.

మీడియాకు వార్తలు కావాలి. అందులోనూ సంచలన వార్తలు కావాలి. రాజకీయ వివాదాలు, కులాల కుమ్ములాటల కన్నా, సినీ తారల నగ్న వీడియోలు బయటకు రావడం క్రేజీ వార్త. అందుకే నిన్నంతా డిజిటల్ టీవీ చానెళ్లు దాని మీదే ఫోకస్ పెట్టాయి. పావలా పిట్టకు, రూపాయి మసాలా నూరినట్లు, వీలయినంత మసాలా దట్టించి వార్తా కథనాలు వండి వార్చాయి.

నిజానికి తెలుస్తున్నది ఏమిటంటే జనాలు గుర్తు పట్టేంత, కాస్త చెప్పుకోదగ్గ సినిమాల్లో నటించిన హీరోయిన్ల వీడియోలు ఏవీ ఈ డిస్క్ లో లేవని, చోటా హీరోయిన్లు, సినిమా అవకాశాల కోసం ప్రయత్నించే ఒకరిద్దరి వీడియోలు మాత్రమే వున్నాయని వినిపిస్తోంది. కానీ అదే మాట చెబితే ఆసక్తి వుండదు కదా. అందుకే అదిగో పులి.. ఇవిగో చారలు అనేంత హడావుడి జరిగిపోతోంది.

2 Replies to “వీడియోలు కావాలని వదిలారా?”

Comments are closed.