ట్విట్టర్ లోకీ కమ్మ – కాపు

ఇన్నాళ్లు రాజకీయాల్లో కులాలు వున్నాయి..మీడియాలో అప్పుడప్పుడు వాటి ప్రస్తావన వస్తుంటుంది..ఫేస్ బుక్ లో ఎవరి గ్రూపుల దుకాణం వారిది. ఇప్పుడు ఇదే గోలను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ కు కూడా పాకిస్తున్నట్లు…

ఇన్నాళ్లు రాజకీయాల్లో కులాలు వున్నాయి..మీడియాలో అప్పుడప్పుడు వాటి ప్రస్తావన వస్తుంటుంది..ఫేస్ బుక్ లో ఎవరి గ్రూపుల దుకాణం వారిది. ఇప్పుడు ఇదే గోలను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ కు కూడా పాకిస్తున్నట్లు కనిపిస్తోంది. వంగవీటి రాధా మీద సినిమా తీస్తాడా..తీయడా అన్న సంగతి పక్కన వుంచితే, కమ్మ.కాపు కులాల ప్రస్తావనతో ట్విట్టర్ ను నింపే ప్రయత్నం మాత్రం విజయవంతంగా చేస్తున్నాడు. 

కేవలం కృష్ణా, గుంటూరు, ఈస్ట్ గోదావరిల్లో మాత్రమే కమ్మ-కాపుల మధ్య వైరుధ్యం వుండేది ఇప్పటి దాకా. పైకా అది వారి వారి కి మాత్రమే తెలిసిన సంగతి. ఇప్పుడు వర్మ ఏకంగా దానికి ప్రచారం కల్పించే పనిని తలకు ఎత్తుకున్నట్లుంది. అది కూడా ఏ లెవెల్ కు అంటే, కమ్మవారి మనస్తత్వాన్ని అర్థం చేసుకున్న కాపే నిజమైన కాపు అంటూ ట్వీట్ చేసేవరకు. అంటే దీన్ని బట్టి వర్మ ఏం చెప్పాలనుకుంటున్నాడు. 

కమ్మవారిని నమ్మవద్దనా..అర్థం చేసుకోమనా? అర్థం చేసుకుని వారితో వైరుధ్యం వద్దనా? లేదా దూరంగా వుండమనా? కాపులకు ఏం చెప్పాలనుకుంటున్నాడు వర్మ? పైగా వంగవీటి రాధాకు సంబంధించిన మంచి ఫొటోలను ట్విట్టర్ లో వుంచి,  కాపుల సామాజిక వర్గంలో ఆరాధ్యుడిగా వున్న వంగవీటి సోదరుల ఇమేజ్ ను మరింతగా ప్రయత్నం కూడా చేస్తున్నట్లు కనిపిస్తోంది. దీనివల్ల రాష్ట్రంలో కులాల వైరుధ్యాలు మరింత పెరిగే అవకాశం వుంది తప్ప తగ్గవు.

 పైగా మొన్నటి ఎన్నికల్లో పవన్ పుణ్యమా అని కాపులు తెలుగుదేశానికి భుజం కాసి, కమ్మసామాజిక వర్గ అనుకూల ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించిన సంగతి అందిరకీ తెలిసిందే. మరి ఇప్పుడు వంగవీటి రాధాను, రంగాను పదేపదే గుర్తు చేయడం ద్వారా, వారి మరణాలు, అందుకు దారి తీసిన పరిస్థితులు, వాటికి కారకులు ఇతరత్రా వ్యవహారాలను మరోసారి కాపుల కళ్ల ముందుకు తెచ్చే ప్రయత్నం చేసినట్లు అవుతుంది. దీనివల్ల రాను రాను ఆవేశ కావేశాలు పెరుగుతాయి కానీ తగ్గవు. 

సినిమా తీస్తే తీసుకోవచ్చు..కానీ అందుకు ముందుగా, ఆ సినిమాకు హైప్ తీసుకురావడం కోసం వర్మ చేసే పనుల వల్ల, రాష్ట్రంలో కులాల నడుమ అంతరాలు పెరిగే ప్రమాదం వుంది. అదీకాక, ప్రస్తుతం కాపు నాయకుల్లో కాస్తో కూస్తో ఫేస్ లుక్, చరిష్మా వున్నది చిరంజీవి..పవన్ లకే. వారంటే పాపం వర్మకు అంతగా సరిపడదు అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రాధా, రంగాలను ప్రొజెక్ట్ చేయడం ద్వారా, పరోక్షంగా వారిని కూడా టార్గెట్ చేస్తున్నాడా అన్నది చిన్న అనుమానం.