ఉపేంద్ర మద్రాసీనా?

సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాత్ర స్వభావ స్వరూపాలేమిటి అన్నది సస్పెన్స్ గా వుంది. ఎందుకంటే ట్రయిలర్ లో కూడా ఈ పాత్ర…

సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాత్ర స్వభావ స్వరూపాలేమిటి అన్నది సస్పెన్స్ గా వుంది. ఎందుకంటే ట్రయిలర్ లో కూడా ఈ పాత్ర కనిపించదు. వినిపించిన గొంతు మాత్రం ఉపేంద్రదా అని సందేహం. అయితే లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఉపేంద్ర క్యారెక్టర్ మద్రాస్ బేస్డ్ అని వినిపిస్తోంది. 

మరోపక్క రాయలసీమ లేదా నెల్లూరు ప్రాంతం కింద చూపిస్తారని అంటున్నారు. ఏదైనా ఈ పాత్రతో తెలుగుతెరపై ఉపేంద్రకు కొత్త తరహా పాత్రలు వస్తాయని అంటున్నారు. సత్యరాజ్ ఏ విధంగా మిర్చితో తెలుగులో కొత్త జోనర్ పాత్రలకు ఏప్ట్ అనిపించుకుంటున్నాడో, ఆ విధంగా ఉపేంద్ర కూడా రెడీ అవుతారంటున్నారు. వెయిట్ అండ్ సీ.