Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

వెంకీమామ అసలు సమస్య అదేనా?

వెంకీమామ అసలు సమస్య అదేనా?

హీరోలు వెంకటేష్-నాగచైతన్య నటించిన వెంకీమామ సినిమా రిలీజ్ డేట్ ఇప్పటి దాకా రాలేదు. అన్ని సినిమాల డేట్ లు వచ్చేసాయి కానీ అదే ఆలస్యం. సినిమాకు సోలో డేట్ కావాలని, లేదా అన్ని విధాలా సరిపోయే డేట్ కావాలని చూస్తున్నారని అందుకే ఆలస్యం అని ఇప్పటి వరకు రకరకాల వార్తలు వస్తూనే వున్నాయి.

అయితే డేట్ రాకపోవడానికి ఇంకో కారణం కూడా వుందని తెలుస్తోంది. ఈ మధ్య ప్రతి సినిమాకు గాఫిక్స్ వర్క్ నే సమస్య. వెంకీమామకు ఆ సమస్య కూడా వుంది. సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు బాగా వున్నాయి. గ్రాఫిక్స్ బాగా అవసరం పడ్డాయి. అయితే ఇప్పటికే ఆ వర్క్ పూర్తయింది. కానీ వచ్చిన గ్రాఫిక్స్ వర్క్ నిర్మాత సురేష్ బాబుకు అస్సలు నచ్చలేదని తెలిసింది.

అస్సలు క్వాలిటీ లేని ఆ గ్రాఫిక్స్ వర్క్ ను తిప్పిపంపినట్లు తెలుస్తోంది. మళ్లీ చేయమని చెప్పినట్లు బోగట్టా. అలాచేసిన వర్క్ నేడో, రేపో రావాల్సి వుంది. అవి చూసి, ఈ సారైనా బాగున్నాయా? లేవా? అన్నది తేల్చకుని అప్పుడు డేట్ డిసైడ్ చేసే ఆలోచనలో సురేష్ బాబు వున్నారని తెలుస్తోంది.

గ్రాఫిక్స్ సోమవారానికి లేదా మంగళవారానికి వచ్చేస్తాయని తెలుస్తోంది. ఒకసారి అన్నీ చూసుకుని, పక్కాగా డేట్ ఇవ్వాలని మళ్లీ మళ్లీ మారుస్తుంటే సినిమా మీద నెగిటివ్ ఇమేజ్ రావడానికి అవకాశం వుంటుందని వెంకీమామ యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆర్టీసీ సమ్మె తో కేసీఆర్ పతనం మొదలైందా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?