వినాయక్ ఫీలయ్యారా?

వివి వినాయక్..ది నెంబర్ వన్ మాస్ డైరక్టర్. పైగా మెగాస్టార్ చిరంజీవి అంటే అన్నయ్య అనే అభిమాన సోదర భావం. అలాంటి వినాయక్ ను ఏరి కోరి తన 150 వ సినిమా కోసం…

వివి వినాయక్..ది నెంబర్ వన్ మాస్ డైరక్టర్. పైగా మెగాస్టార్ చిరంజీవి అంటే అన్నయ్య అనే అభిమాన సోదర భావం. అలాంటి వినాయక్ ను ఏరి కోరి తన 150 వ సినిమా కోసం తెచ్చుకున్నారు మెగాస్టార్. సినిమా స్క్రిప్ట్ రెడీ అవుతుండగానే, టైటిల్ ఇదీ అని చెప్పకుండానే, పబ్లిక్ ఫంక్షన్ లో కత్తిలాంటోడు అనే పద ప్రయోగం చేసారు వినాయక్. 

నిజానికి అది చాలా బాగుంది కూడా. ఎంత బాగుంది అంటే అతి అభిమానుల్లోకి కత్తిలాంటి టైటిల్ గా దూసుకుపోయింది. ఆ తరువాత అదే పాపులర్ అయిపోయింది. సినిమా పూజ సమయంలో కానీ, మరెప్పుడూ కానీ ఈ టైటిల్ గురించి ప్రస్తావనే లేదు. అది కాదు అనలేదు.. అవును అనలేదు. అలాంటిది రామ్ చరణ్ ఒక్కసారిగా అది టైటిల్ కాదు.. అని ప్రకటించేసరికి అభిమానుల్లో చిన్న కన్ ఫ్యూజన్.

హీరోయిజం వుట్టిపడే ఈ టైటిల్ కన్నా మంచి టైటిల్ ఇంకేంటీ? అని. అయితే అభిమానుల సంగతి అలా వుంచితే దర్శకుడు వినాయక్ కూడా ఫీలయ్యారని ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్. వినాయక్ ఈ టైటిల్ చాలా ఇష్టంగా ఫీలయ్యారట. అందుకే అన్నయ్య కత్తిలాంటోడు అని మరీ ముద్దుగా జనానికి చెప్పారు. ఇప్పుడు అది టైటిల్ కాదు అని ప్రకటించేసరికి వినాయక్ ఫీలయినట్లు వినికిడి.