విశాఖలో సత్యమూర్తి సభ?

సత్యమూర్తి విజయోత్సవ సభ జరపాలని అనుకున్నారు కొద్ది రోజుల క్రితం. కానీ వెన్యూ దొరక్క వాయిదా పడింది. ఆ తరువాత దాన్ని జరపాలా వద్దా అని కిందా మీదా అయ్యారు. కానీ ఇప్పుడు జరపాలని,…

సత్యమూర్తి విజయోత్సవ సభ జరపాలని అనుకున్నారు కొద్ది రోజుల క్రితం. కానీ వెన్యూ దొరక్క వాయిదా పడింది. ఆ తరువాత దాన్ని జరపాలా వద్దా అని కిందా మీదా అయ్యారు. కానీ ఇప్పుడు జరపాలని, అదీ విశాఖలో జరపాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. దీని వెనుక ఓ ఆసక్తికరమైన వ్యవహారం వుందని తెలుస్తోంది.

విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు కలిపి అయిదు కోట్ల పాతిక లక్షలకు సత్యమూర్తి హక్కులు ఎన్ఆర్ పద్దతిన విక్రయించారని వినికిడి. అంటే లాభమైనా, నష్టమైనా బయ్యర్ దే బాధ్యత. కానీ ఇప్పుడు అక్కడ సత్యమూర్తి కలెక్షన్లు పడుకున్నాయి. సగం కూడా రాలేదు. దాంతో ఆ బయ్యర్ గగ్గోలు పెట్టడమే కాకుండా, తనను ఆదుకోవాలని, రెండు కోట్లకు పైగా పోతోందని వత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. 

కానీ టాలీవుడ్ లో ఇచ్చిన డబ్బులు వెనక్కు రావడం అంటే గోడకు వేసిన సున్నం గోక్కోవడం లాంటిది. అయితే అలా అని గోల పెట్టే వాడికి ఏదో ఒకటి చెప్పకుంటే ఎలా? అందుకే విజయోత్సవ సభ జరపాలనుకుంటున్నామని, దాన్ని విశాఖలో జరిపే ఆలోచన వుందని, అలా చేస్తే, ఉత్తరాంధ్ర ప్రాంత కలెక్షన్లు పెరిగి, గట్టెక్కుతారని బయ్యర్ ను నచ్చ చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు అమలు అవుతుందో చూడాలి.