ఎవ‌డు టికెట్ రూ.1000

దిల్‌రాజు అప్పుడే ఎవ‌డు సినిమాపై డ‌బ్బులు పోగేసుకొనే ప‌నిలో ప‌డిపోయాడు. ఎవ‌డు సినిమాని ప్రీమియ‌ర్ షోల ద్వారా.. ఆదాయం స‌మ‌కూర్చుకొనే ప్లాన్‌లో ఉన్నాడీ నిర్మాత‌. ఎవ‌డు సినిమాని జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేయ‌బోతున్నారు. డేటు…

దిల్‌రాజు అప్పుడే ఎవ‌డు సినిమాపై డ‌బ్బులు పోగేసుకొనే ప‌నిలో ప‌డిపోయాడు. ఎవ‌డు సినిమాని ప్రీమియ‌ర్ షోల ద్వారా.. ఆదాయం స‌మ‌కూర్చుకొనే ప్లాన్‌లో ఉన్నాడీ నిర్మాత‌. ఎవ‌డు సినిమాని జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేయ‌బోతున్నారు. డేటు మారే అవ‌కాశాలూ ఉన్నాయి. 

అయితే విడుద‌ల‌కు ఒక్క రోజు ముందు ప్రీమియ‌ర్ షో వేయాల‌నుకొంటున్నాడు దిల్ రాజు. టికెట్ రూ.1000లుగా నిర్ణయించిన‌ట్టు స‌మాచార‌మ్‌. సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టుకీ ఇదే ప్లాన్ వేశాడాయ‌న‌. ఆ సినిమానీ ఒక్క రోజు ముందే చూసేశారు సినీజ‌నాలు. 

ఆ సినిమా టికెట్టు కూడా రూ.1000 కాక‌పోతే ఆ డ‌బ్బు ఓ మంచి ప‌ని కోసం వాడారు. ఇప్పుడు త‌మ ఖాతాలో వేసుకొంటార‌న్నమాట‌. ఇప్పటికీ ఈ సినిమా విడుద‌ల ఆల‌స్యం అయిపోయింది. వ‌డ్డీ త‌డిసి మోపెడ‌య్యింది. మ‌రి ఈ మాత్రం ముందు జాగ్రత్త ఉండాల్లేండి.