అల్లుడు ‘కామెడీ ట్రైలర్’

బెల్లంకొండ శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ అల్లుడు అదుర్స్.  సంతోష్ శ్రీనివాస్ డైరక్షన్ లో తయారైన ఈ సినిమా సంక్రాంతికి విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ ను వదిలారు.  Advertisement అవుట్ అండ్ అవుట్ ఫన్…

బెల్లంకొండ శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ అల్లుడు అదుర్స్.  సంతోష్ శ్రీనివాస్ డైరక్షన్ లో తయారైన ఈ సినిమా సంక్రాంతికి విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ ను వదిలారు. 

అవుట్ అండ్ అవుట్ ఫన్ టార్గెట్ గా ట్రైలర్ ను కట్ చేసినట్లు కనిపిస్తోంది. జస్ట్ హీరో, హీరోయిన్, వారి ప్రేమ ను పరిచయం చేసేసి, స్ట్రయిట్ గా కామెడీ ట్రాక్ లోకి వెళ్లిపోయారు.

సినిమాలో కీలకమైన ఓ ఎపిసోడ్ నే ట్రయిలర్ లోకి తేవాలని అనుకున్నట్లు కనిపిస్తోంది. హీరో, అతని మిత్రబృందం కలిసి ఓ ఇంట్లో చేసిన హర్రర్ కామెడీ డ్రామాను బాగా ఎలివేట్ చేయాలనే ప్రయత్నం కనిపించింది. 

ఈ ట్రాక్ మినహా మిగిలిన సినిమా అంతా వేరే వుంటుదని అనుకోవాల్సి వస్తోంది. అదే టైమ్ లో భారీగా చిత్రీకరించిన పాటలు, బెల్లంకొండ హీరోకి అలవాటైన ఫైట్స్ ను కూడా ట్రైలర్ లో యాడ్ చేసారు. 

సత్య, శ్రీనివాసరెడ్డి, సప్తగిరి, వెన్నెల కిషోర్, తో పాటు జబర్దస్ట్ శ్రీను, చంద్ర తదిరులంతా కనిపించారు. కమర్షియల్ ఎలిమెంట్స్ ఎలాగూ వుంటాయి. కామెడీ అదనపు బోనస్ అనేది చెప్పడానికి ట్రైలర్ లో ట్రయ్ చేసినట్లు కనిపిస్తోంది.