హీరో గోపీచంద్ లేటెస్ట్ మూవీ భీమా. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ నిర్మించారు. మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా ఈ చిత్రం విడుదలవుతున్న నేపధ్యంలో నిర్మాత కె కె రాధామోహన్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
ఈ కథలో చాలా కొత్త ఎలిమెంట్స్ వున్నాయి. గోపీచంద్ ఇంతకుముందు పోలీస్ పాత్రలు చేశారు కానీ ఈ పాత్ర చాలా డిఫరెంట్. చాలా కొత్త జానర్ లో వుండే కథ ఇది. ప్రస్తుతం ప్రేక్షకుల ఇలాంటి కథలని గొప్పగా ఆదరిస్తున్నారు. తప్పకుండా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందనే నమ్మకంతో ప్రాజెక్ట్ ని మొదలుపెట్టాం. కథలో చాలా సర్ ప్రైజ్ ఎలిమెంట్స్ వున్నాయి. ట్రైలర్ లో పోలీస్ కాకుండా గోపిచంద్ గారి మరో గెటప్ చూసి ప్రేక్షకులు చాలా ఎక్సయిట్ అవుతున్నారు. అది ఏమిటనేది మార్చి 8న తెలుస్తుంది.
'అఖండ' కి భీమాకి ఏ మాత్రం పోలిక లేదు. భీమాలో చూపించిన పరశురామక్షేత్రం బెంగళూరు, బాదామి పరిసరప్రాంతాల్లో వుంటుంది. అక్కడ జరిగే కథ ఇది. శివాలయం, అఘోరాలను యాంబియన్స్ కోసం చూపించాం. అఘోరాలకు కథతో సంబంధం లేదు. కథ, జోనర్ పరంగా ఇది చాలా డిఫరెంట్ మూవీ.
హర్ష కన్నడలో పేరుపొందిన దర్శకుడు, హర్ష చాలా క్లారిటీ వున్న దర్శకుడు. తను కొరియోగ్రఫర్ కూడా. మా బెంగాల్ టైగర్ సినిమాకి చేశారు. భీమాని చాలా అద్భుతంగా తీశారు. అలాగే ఇందులో రెండు పాటలకు కొరియోగ్రఫీ కూడా చేశారు. ఈ సినిమా మంగుళూరు, బాదామి, ఉడిపి, మారేడుమిల్లి, వైజాగ్ ఇలా చాలా డిఫరెంట్ లోకేషన్స్ లో షూట్ చేశాం. అన్నపూర్ణలో ఒక భారీ టెంపుల్ సెట్ ని క్రియేట్ చేశాం. కథకు తగ్గట్టుగా ఎక్కడా రాజీపడకుండా తీశాం. మేము అనుకున్న క్యాలిటీ ఇవ్వగాలిగాం. దాని కారణంగా బడ్జెట్ పెరిగింది. భీమా బిజినెస్ పరంగా హ్యాపీగా వున్నాం.
ట్రైలర్ లో చూపించినట్లుగా ఇందులో గోపిచంద్ ది బ్రహ్మరాక్షుడి క్యారెక్టరైజేషన్ గానే వుంటుంది. అయితే కథలో సిట్యువేషనల్ కామెడీ వుంటుంది. చిన్న లవ్ ట్రాక్ కూడా వుంది. భీమాలో వీఎఫ్ఎక్స్ కి చాలా ప్రాధాన్యత వుంది.