బిగ్‌బాస్ బ్యూటీ అందాల ఆర‌బోత

భానుశ్రీ అని చెబితే వెంట‌నే గుర్తించ‌డం క‌ష్టం. అదే బిగ్‌బాస్ -2 కంటెస్టెంట్ భానుశ్రీ అని చెబితే మాత్రం వెంట‌నే క‌నెక్ట్ అవుతారు. ఆ రియాల్టీ షోతో ఆమె అంత‌గా ఆమె పాపుల‌ర్ అయ్యారు.…

భానుశ్రీ అని చెబితే వెంట‌నే గుర్తించ‌డం క‌ష్టం. అదే బిగ్‌బాస్ -2 కంటెస్టెంట్ భానుశ్రీ అని చెబితే మాత్రం వెంట‌నే క‌నెక్ట్ అవుతారు. ఆ రియాల్టీ షోతో ఆమె అంత‌గా ఆమె పాపుల‌ర్ అయ్యారు. అంత‌కు ముందు అడ‌పాద‌డ‌పా బుల్లితెర‌పై క‌నిపిస్తూ వ‌చ్చిన భానుశ్రీ ఒక‌ట్రెండు సినిమాల్లో కూడా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నారు. 

అయితే అవేవీ ఆమెకు అంత గుర్తింపు తీసుకురాలేక పోయాయి.  ప్ర‌స్తుతం మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న‌ భానుశ్రీ సోష‌ల్ మీడియాలో అప్పుడ‌ప్పుడు త‌ళుక్కుమ‌ని మెరుస్తుంటారు.

ఇంత‌కూ ఇప్పుడామె గురంచి ఎందుకంటారా? అక్క‌డికే వ‌స్తున్నా. తాజాగా త‌న అంద‌చందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ భానుశ్రీ సోష‌ల్ మీడియాలో కొన్ని ఫొటోల‌ను షేర్ చేశారు.

ర‌వివ‌ర్మ గీసిన చ‌క్క‌టి చిత్రంలా భానుశ్రీ క‌ళా హృద‌యాన్ని ఆక‌ర్షించే స్టైల్‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. చూప‌రుల‌కు మ‌త్తెక్కించే భంగిమ‌లోనూ, అలాగే ఎవ‌రి కోస‌మో ఎదురు చూస్తున్న క‌న్నెపిల్ల‌లా, సిగ్గులొలికే ప‌డుచు పిల్ల‌గా భానుశ్రీ అన్ని ర‌కాల అభిన‌యాల్ని ఆ ఫొటోల్లో ప్ర‌ద‌ర్శించారు.

హాఫ్ సారీ లుక్ లో ముక్కుపుడక‌, రింగుల్లాంటి చెవి క‌మ్మ‌లు, కాటుక కండ్ల‌తో కాస్త సిగ్గుప‌డుతూ, క‌వ్విస్తూ  దిగిన ఫొటోలు వేటిక‌వే ప్ర‌త్యేకం అని చెప్పాలి. అందుకే ఈ ఫొటోలు  సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. 

Click Here For Photo Gallery

జడ్జిమెంట్స్ పై నాకు ఎంతైనా మాట్లాడే హక్కుంది