పవన్ కళ్యాణ్-పీపుల్స్ మీడియా కాంబినేషన్‌లో గురూజీ త్రివిక్రమ్ స్క్రిప్ట్, మాటలతో, సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘బ్రో’. ఈ సినిమా నైజాం హక్కుల పంచాయతీ ముగిసింది మంచి రేటుకు మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్స్ సంస్థ తీసుకుంది.
32 కోట్ల నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ ప్రాతిపదికన సినిమా ఇచ్చారు. అంటే ఈ మేరకు షేర్ రావాలి. ఒకవేళ షేర్ మాత్రమే వచ్చి, అక్కడితో ఆగినా, జిఎస్టీ నిర్మాతే కట్టాల్సి వుంటుంది. లేదూ జస్ట్ బోర్డర్ దాటి, జిఎస్టీ కూడా వస్తే నిర్మాత ఇవ్వనక్కరలేదు. అంటే మొత్తం మీద మైత్రీ డిస్ట్రిబ్యూటర్ సంస్థకు 38 కోట్ల వరకు నైజాంలో షేర్ రావాల్సి వుంటుంది.
ఆదిపురుష్ సినిమాను మైత్రీ సంస్థనే తీసుకుంది. కానీ దాని లాభ నష్టాల సంగతి ఏమీ బ్రో తో లింక్ లేదని తెలుస్తోంది. బ్రో డీల్ బ్రో సినిమాదే. వాస్తవానికి బ్రో సినిమా నైజాం హక్కులు 35 కోట్లకు ఇవ్వాలని నిర్మాతలు పీపుల్స్ మీడియా సంస్థ గట్టిగా ప్రయత్నించింది.
దిల్ రాజు 30 వరకు వెళ్లి ఆగిపోయారని బోగట్టా. తరువాత మైత్రీ సంస్థ అధినేత శశి తో డీల్ చేసారు. అక్కడ కూడా ఎంత ప్రయత్నించినా 35 వరకు వెళ్లలేదు. ఆఖరికి 32 దగ్గర క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది.
బ్రో సినిమా ఈ నెల 28న థియేటర్లలోకి వస్తోంది. నైజాం మినహా మిగిలిన ఏరియాలన్నీ ఇప్పటికే క్లోజ్ అయిపోయాయి.