బన్నీ కొత్త సినిమా ప్రకటన వస్తోంది

హడావుడి అంతా రామ్ చరణ్..ఎన్టీఆర్ వైపు వుంది. ఆర్ ఆర్ ఆర్ హడావుడి హోరెత్తుతోంది. ఇలాంటి టైమ్ లో స్టయిలిష్ స్టార్ బన్నీ ఎక్కడ వున్నారు? తన పుష్ప 2 సినిమా షూట్ లో…

హడావుడి అంతా రామ్ చరణ్..ఎన్టీఆర్ వైపు వుంది. ఆర్ ఆర్ ఆర్ హడావుడి హోరెత్తుతోంది. ఇలాంటి టైమ్ లో స్టయిలిష్ స్టార్ బన్నీ ఎక్కడ వున్నారు? తన పుష్ప 2 సినిమా షూట్ లో బిజీగా వున్నారు. మరి ఫ్యాన్స్ కు సందడి ఏదీ? ఎప్పటి నుంచి ఫ్యాన్స్ ఓ అప్ డేట్ లేకుండా డీలాగా వున్నారు. అందుకే వాళ్లను హుషారు చేయాలి కదా? సందడి వుండాలి కదా? సో..దాని కోసం రేపు ఒక అప్ డేట్ వస్తోంది.

పుష్ప 2 నుంచి కాదు. బన్నీ ఫ్యూచర్ లో చేయబోయే ఓ ప్రాజెక్టు గురించి. అయితే ఇది త్రివిక్రమ్-హారిక హాసిని సినిమా కాదు.ఆ సినిమా టార్గెట్ 2024 సెకండాఫ్ లో. ఇప్పుడు ప్రకటించబోయేది 2025లో రాబోయే సినిమా గురించి, నిర్మాత, దర్శకుడు ఇలాంటి వివరాలతో ప్రకటన రాబోతోంది. ప్రస్తుతానికి ఈ వివరాలు గుట్టుగా వుంచారు.

ఈ ప్రకటించే సినిమాకు నెంబర్ ఏమీ వుండదు. జస్ట్ ప్రకటిస్తారంతే. మొత్తం మీద బన్నీ ఫ్యాన్స్ ఓ రోజంతా సందడి చేసుకునే ప్రకటన రేపు రాబోతోంది.