ఇకపై గొడవలొద్దు బ్రదర్

తనకు అనిపించినప్పుడు, తన మనసుకు నచ్చినప్పుడు అల్లు అర్జున్ ఏ పనైనా చేస్తాడని.. ఈసారి కూడా అలానే వ్యవహరించాడని అల్లు ఆర్మీ సమర్థించుకుంటోంది.

“కల్యాణ్ బాబాయ్.. థ్యాంక్ యు సో మచ్”.. ఏళ్లుగా బన్నీ నోటి నుంచి పవన్ ఫ్యాన్స్ వినాలనుకున్న డైలాగ్ ఇది. ఎట్టకేలకు అల్లు అర్జున్ చెప్పేశాడు. మొన్నటివరకు “చెప్పను బ్రదర్” అన్న బన్నీ ఇప్పుడు కల్యాణ్ బాబాయ్ థ్యాంక్యూ అన్నాడు. పవన్-బన్నీ అభిమానులు వార్ ఆపడానికి ఇంతకంటే ఇంకేం కావాలి.

పవన్ కల్యాణ్ అభిమానులు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో, కొన్నిచోట్ల బాహాటంగా కొట్టుకున్న సందర్భాలూ ఉన్నాయి. తమదంతా పవనిజం అని వాళ్లు చెప్పుకుంటుంటే, తమది అల్లు ఆర్మీ వాళ్లు చెప్పుకున్నారు. తగ్గేదేలే అంటూ పరస్పరం దాడులు-ప్రతి దాడులతో రెచ్చిపోయారు.

ఎప్పుడైతే అల్లు అర్జున్, ఏపీ ఎన్నికల టైమ్ లో వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేశాడో, అప్పుడిక ఈ యుద్ధం పీక్ స్టేజ్ కు చేరుకుంది. దీన్ని చల్లార్చాల్సిన బాధ్యత బన్నిపైనే ఉందనేది అందరికీ తెలిసిందే. ఎట్టకేలకు ఆ రోజు రానే వచ్చింది. కల్యాణ్ బాబాయ్ అంటూ బన్నీ సంభోధించడం.. పవన్ ఫ్యాన్స్ కు నచ్చింది.

బన్నీ తగ్గాడా.. పవన్ నెగ్గారా?

ప్రస్తుతం సోషల్ మీడియాలో నడుస్తున్న ఈ చర్చకు అర్థం లేదు. పుష్ప-2కు భారీగా రేట్లు ఇచ్చారు కాబట్టే అల్లు అర్జున్, పవన్ పేరు ప్రస్తావించాడని కొందరన్నారు. ఆమధ్య బాలకృష్ణ షోలో పవన్ కల్యాణ్ ను బన్నీ పొగడ్డానికి కూడా ఇదే కారణం అన్నారు. తనకు అనిపించినప్పుడు, తన మనసుకు నచ్చినప్పుడు అల్లు అర్జున్ ఏ పనైనా చేస్తాడని.. ఈసారి కూడా అలానే వ్యవహరించాడని అల్లు ఆర్మీ సమర్థించుకుంటోంది.

కారణం-సందర్భం ఏదైనా.. ఇదొక మంచి పరిణామం. ఇకనైనా అభిమానులంతా కలవాలి. సినిమాను సినిమాగా చూడాలి.

13 Replies to “ఇకపై గొడవలొద్దు బ్రదర్”

  1. లెవెన్ గాడు సంధ్యలో రేవతిని లేపేసి “తన మార్క్ శవ రాజకీయం” స్టార్ట్ చేసిన తర్వాత కానీ, బన్నీ గాడికి మైండ్ బ్లాంక్ అయ్యి, పవన్ గుర్తొచ్చాడు.. ఏకంగా pawan బాబాయ్ అయ్యాడు … కదరా గ్రేట్ గ్యాసు?? లేకపోతే నా తొక్కలో పవన్ అనేవాడు.. వాళ్ళని మళ్ళీ కలిపినందుకు thanks రా జెగ్గుల్

  2. ఎప్పుడైతే బన్నీ వైసిపి ఫ్రెండ్ తరపున ప్రచారం చేశాడో అప్పటి నుండి GA బన్నీ ని ఓన్ చేసుకొని ఫుల్ పాజిటివ్ అరికల్స్ రాయడం మొదలెట్టాడు. ఇప్పుడు విషయానికి వద్ధం ఎప్పుడైతే పుష్ప2 కలెక్షన్స్ డే2 ఎఫెక్ట్ప పడిందో అప్పుడు పవన్ బాబాయ్ గుర్తుకు వచ్చాడు. వెంటనే GA gaaru article రాశారు.

  3. గొడవలు ఆగిపోతాయి అనే కదా మీ భయం అంతా…అందుకే అంబటి మనవాడు అని ట్వీట్ ఎదో చేసినట్టుంది….మనం వేరే వాళ్ళ ఫామిలీ గొడవల్లో తలా దూర్చవచ్చు కానీ మన ఫామిలీ గొడవల్నివేరే వాళ్ళు కాష్ చేసుకోకూడదు

Comments are closed.