హీరోయిన్ ను దుస్తులు విప్పి కూర్చోమన్నాడు

ఓసారి అతడి నుంచి పిలుపొచ్చింది. ఎగిరిగంతేశాను. వెళ్లిన తర్వాత నరకం చూపించాడు. దుస్తులు ఎందుకు విప్పేసెయ్ అన్నాడు

దర్శకుడు సాజిత్ ఖాన్ పై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు కొత్త కాదు. “మీ టు” మూమెంట్ జోరుగా నడిచిన కాలంలో ఎక్కువగా టార్గెట్ అయింది ఇతడే. అప్పట్లో ముగ్గురు మహిళలు ఇతడిపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేశారు. ఇప్పుడు మరో నటి ఇతగాడిపై విరుచుకుపడింది.

సీరియల్ నటి నవీన, సాజిద్ ఖాన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. మాట్లాడదామని పిలిచి, దుస్తులు విప్పమన్నాడంటూ ఒకప్పటి చేదు జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంది. తన జీవితంలో మళ్లీ కలవకూడదని భావిస్తున్న వ్యక్తిగా అతడ్ని చెప్పుకొచ్చింది.

“ఓసారి అతడి నుంచి పిలుపొచ్చింది. ఎగిరిగంతేశాను. వెళ్లిన తర్వాత నరకం చూపించాడు. దుస్తులు ఎందుకు విప్పేసెయ్ అన్నాడు. లో-దుస్తులతో నువ్వు ఎంత సౌకర్యంగా కూర్చోగలవో తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. నాకు ఒక్కసారిగా షాక్ తగిలింది.”

ఇప్పటికిప్పుడు దుస్తులు విప్పలేనని, ఇంటికెళ్లి బికినీ తెచ్చుకుంటానంటూ అక్కడ్నుంచి తప్పించుకున్నానని తెలిపింది నవీన. ఇప్పటికీ ఆ ఘటన తలుచుకుంటే తనకు వణుకు వస్తోందని వెల్లడించింది.

ఈ తరహా ఆరోపణలు సాజిద్ ఖాన్ పై కొత్త కాదు. నటి రాచెల్ వైట్, అసిస్టెంట్ డైరక్టర్ సలోనీ చోప్రా, జర్నలిస్ట్ కరిష్మా గతంలో ఇతడిపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేశారు. నవీన ఇప్పుడీ లిస్ట్ లో చేరారు.

గతంలో ఆరోపణలు వచ్చినప్పుడే పెద్ద సినిమా ఆఫర్ పోగొట్టుకున్నాడు సాజిద్. ఆ తర్వాత అతడి కెరీర్ దాదాపు క్లోజ్ అయింది. తాజా ఆరోపణలతో కెరీర్ పరంగా అతడు కొత్తగా పోగొట్టుకునేదేం ఉండదు. నవీన కేసు పెడితే మాత్రం విషయం సీరియస్ అవుతుంది.

6 Replies to “హీరోయిన్ ను దుస్తులు విప్పి కూర్చోమన్నాడు”

  1. వీడు బెటర్ ఆమెనే విప్పి కూర్చోమన్నాడు.. అదే మా లెవెనన్న అయ్యుంటే,   నీ ఇష్టా ఇష్టాలతో పని లేకుండా ఆడే బట్టలూడదీసేవాడు.. నీకు పారిపోయే ఛాన్స్ కూడా ఉండేది కాదు తెల్సా??

Comments are closed.