చైతూ కి 9 నాగ్ కు 5

బంగార్రాజు ప్రాజెక్ట్ అన్నపూర్ణ స్టూడియోస్ కు ఎలా వున్నా హీరోలు ఇద్దరికీ మాత్రం మంచి రెమ్యూనిరేషన్లు ముట్టాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం. సీనియర్ హీరో నాగార్జునకు అయిదు కోట్లు, యంగ్ హీరో చైతన్యకు…

బంగార్రాజు ప్రాజెక్ట్ అన్నపూర్ణ స్టూడియోస్ కు ఎలా వున్నా హీరోలు ఇద్దరికీ మాత్రం మంచి రెమ్యూనిరేషన్లు ముట్టాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం. సీనియర్ హీరో నాగార్జునకు అయిదు కోట్లు, యంగ్ హీరో చైతన్యకు తొమ్మిది కోట్లు రెమ్యూనిరేషన్ గా మిగిలినట్లు తెలుస్తోంది.

సినిమాకు జీటీవీ 49 కోట్లు బడ్జెట్ ఇచ్చింది. ఇందులోనే అన్నీ. సినిమా నిర్మాణానికి అంతా కలిపి 34 నుంచి 35 కోట్లు ఖర్చయినట్లు తెలుస్తోంది. అంటే మిగిలిన 14 కోట్లు ఇద్దరు హీరోలకూ అన్నమాట. అయితే నాగ్ లాస్ట్ మినిట్ లో వైజాగ్, కృష్ణ, నైజాం ఏరియాలను తన అక్కౌంట్ లోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ఈ మూడింటి మీద 14 వరకు రావాలి. నైజాం నుంచి అయిదు కోట్ల అడ్వాన్స్ వచ్చింది. ఫస్ట్ వీకెండ్ లోనే అది చెల్లిపోతుందని భావిస్తున్నారు. తొలి రోజు నైజాంలో 1.80 షేర్ వచ్చినట్లు తెలుస్తోంది. 

వైజాగ్ లో హయ్యర్స్ తో కలిపి కోటికి పైగా షేర్ వచ్చింది. కృష్ణా జిల్లాలో 46 లక్షలు షేర్ రాబట్టారు. అందువల్ల అవకాశం వుంటే 14 కోట్లకు దాటే వచ్చేలా వుంది.