Advertisement

Advertisement


Home > Movies - Movie News

సినిమా ఒక మాయ.. పాలిటిక్స్ మాయాలోకం..!

సినిమా ఒక మాయ.. పాలిటిక్స్ మాయాలోకం..!

ఒకప్పుడు హీరోగా ఎనో సక్సెస్ సినిమాలు చేసి సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్నారు జగపతి బాబు. ఓటీటీల్లో వెబ్‌ సిరీస్‌లలోనూ నటిస్తున్నాడు. 

ఇటీవలే హాట్‌స్టార్‌లో పరంపర సీజన్ 2 సిరీస్‌తో ప్రేక్షకులను అలరించారు. ఈ సిరీస్ మంచి విజయం సాధించింది. ఈ సిరీస్ ఫ్యామిలీ, పాలిటిక్స్ కథతో తెరకెక్కింది. పరంపర ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో రాజకీయాల గురించి మాట్లాడారు జగపతి బాబు.

ఈ ఇంటర్వ్యూలో జగపతిబాబుని రాజకీయాల గురించి పలు ప్రశ్నలు అడగగా వాటికి సమాధానమిస్తూ.. ”సినిమానే ఒక మాయ. పాలిటిక్స్ ఒక మాయాలోకం. ఆ మాయాలోకం అర్థం చేసుకోవడం నావల్ల కాదు. నాకంత బుర్ర లేదు, అంత ఓపిక లేదు. రాజకీయాల గురించి నేను అసలు ఆలోచించాను. నాకు నలుగురితో మాట్లాడే తెలివే లేదు. అలాంటిది రాజకీయాల్లో జాయిన్‌ అయి వాళ్లతో ముందుకెళ్లడం చాలా కష్టం. 

నాలాంటోడు రాజకీయాలకు పనికిరాడు. పాలిటిక్స్ లో ఫ్రెండ్స్ ఉన్నారు, కలుస్తూ ఉంటాం, అంతేగాని రాజకీయాల్లోకి ఎంట్రీ మాత్రం ఇవ్వను. రాజకీయాల గురించి నాకున్న అవగాహన సున్నా కాబట్టి పాలిటిక్స్‌లో నా ఎంట్రీ, లేదా నేను పార్టీ పెట్టడం అనేది జరగని పని” అని తెలిపారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?