Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఓజీ రావట్లేదు.. దేవర వస్తున్నాడు

ఓజీ రావట్లేదు.. దేవర వస్తున్నాడు

పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. అయితే ఆ డేట్ కు సినిమా వచ్చేది కష్టమంటూ ఆ తర్వాత ఫీలర్లు కూడా వచ్చాయి. అంతా దానికి ఫిక్స్ అయిపోయారు కూడా. ఇప్పుడదే నిజమైంది. ఓజీ డేట్ ను దేవర ఆక్రమించింది.

అవును.. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాను సెప్టెంబర్ 27న విడుదల చేయబోతున్నారు. నిజానికి ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల చేయబోతున్నట్టు గతంలో ప్రకటించారు. కానీ మారిన సమీకరణాల దృష్ట్యా కాస్త ముందుగానే రిలీజ్ కు రెడీ చేస్తున్నారు.

ఓవైపు పెద్ద సినిమాలన్నీ వరుసగా వాయిదాలు పడుతుంటే, దేవర సినిమా చెప్పిన తేదీ కంటే కాస్త ముందుగానే విడుదలకు సిద్ధమవ్వడం విశేషమే.

దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న లక్కీ భాస్కర్ అనే సినిమాను కూడా సెప్టెంబర్ 27కే షెడ్యూల్ చేశారు. దేవర రాకతో ఇప్పుడీ సినిమా విడుదలపై అనుమానాలు పెరిగాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కూడా వాయిదా పడే అవకాశం ఉంది. ఎందుకంటే, ఎన్టీఆర్ కు పోటీగా 'సితార' నాగవంశీ సినిమా వేయరు.

మొత్తానికి అనుకున్న టైమ్ కంటే కాస్త ముందుగానే దేవర థియేటర్లలోకి వస్తోంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. జాన్వికపూర్ ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమౌతోంది. సైప్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఆల్రెడీ ఒక పాట రిలీజైంది. 

 


  • Advertisement
    
  • Advertisement