డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, ప్రొడ్యూసర్ దిల్ రాజు తన యాభయ్యవ బర్త్ డే ధూమ్ ధామ్ గా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. తన కుమార్తె కోసం నిర్మించిన ఇంట్లో ఫంక్షన్ చేయబోతున్నారు. ఆయన, ఆయన కుమార్తె హన్సిక సినిమా సెలబ్రిటీలను స్వయంగా ఆహ్వానిస్తున్నారు. కొందరికి వాట్సాప్ లో ఆహ్వానపత్రిక కూడా పంపించారు.
కొన్నాళ్ల క్రితం దిల్ రాజు పార్టనర్, బంధువు శిరిష్ తన బర్త్ డే ను ధూమ్ ధామ్ గా స్టార్ హోటల్ లో సెలబ్రేట్ చేసుకున్నారు. చాలా మంది హీరోలు సైతం వెళ్లి వచ్చారు. ఇప్పుడు దిల్ రాజు టర్న్ వచ్చింది.
సినిమా రంగానికి సంబంధించిన అన్ని రంగాల్లోకి దిల్ రాజు విస్తరించారు. అందువల్ల ఆయన ఆహ్యానాన్ని ఎవ్వరూ కాదనకుండా, తప్పకుండా అటెండెన్స్ వుంటుంది.
ఇదిలా వుంటే మీడియాకు కూడా చాలా మంది సెలబ్రిటీలు చేసే విధంగానే ఓ పార్టీ ఏర్పాటు చేసేసారు. సెలబ్రిటీలు రాకుండానే పార్టీ ఇచ్చేసి, మీడియాను వచ్చి స్వీకరించి వెళ్లమని కోరడం టాలీవుడ్ లో అలవాటు. ఒక్కోసారి పార్టీ మధ్యలో ఇలా వచ్చి, అలా పలకరించి వెళ్లడం కూడా మామూలే.
దిల్ రాజు తన యాభయ్యవ బర్త్ డే సందర్భంగా దిల్ రాజు అనే పేరు 50 అనే నెంబర్ కలిసి వచ్చేలా ఓ లోగో కూడా డిజైన్ చేసారు. అది కూడా ఆహ్వాన పత్రిక మీద వేసారు.