సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హీరోల్లో సుశాంత్ ఒకడు. ఎలాంటి ప్రశ్న అడిగినా స్కిప్ చేయకుండా సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాడు ఈ హీరో. ఇందులో భాగంగా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అనే ప్రశ్నకు ఫన్నీగా రియాక్ట్ అయ్యాడు. వీటితో పాటు మరికొన్ని ప్రశ్నలకు సుశాంత్ ఇచ్చిన సమాధానాలు..
సాఫ్ట్ వేర్ ఇంజినీర్, యాక్టర్ లో ఏది ఇష్టం?
సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా యాక్ట్ చేయడం ఇష్టం
గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా?
ఆ.. చెప్తారు మరి. అలాంటివి అడక్కూడదు
మాస్, క్లాస్ కథల్లో ఏవి చేయాలనుకుంటారు?
స్క్రిప్ట్ ఏది బాగుంటే అది చేస్తాను.. మాస్, క్లాస్ అనేది తర్వాత సంగతి.
ఇష్టమైన బాలీవుడ్ హీరో
హృతిక్ రోషన్ అంటే చాలా ఇష్టం
అడ్డంకుల్ని ఎలా అధిగమిస్తారు?
ముందు సమస్యను అంగీకరించాలి. తర్వాత దానిపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాలి. పరిష్కారం దొరికేంత వరకు శోధించడమే.
మీ ఫ్యూచర్ ఏంటి?
ప్రస్తుతాన్ని ఎంజాయ్ చేయడమే
ఏ షాంపూ వాడుతుంటావ్?
బెడ్ హెడ్ – టీఐజీ
తినడం, వండటం.. ఏదిష్టం
తినడానికి తొలి ప్రాధాన్యం. కానీ త్వరలోనే వంట చేస్తాను.
కన్నింగ్ విలన్ పాత్ర వస్తే చేస్తారా?
స్క్రిప్ట్ బాగుంటే విలన్ గా కనిపించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు.
హిందీ, తమిళ సినిమాలు చేస్తారా?
ఎప్పుడూ నేను సిద్ధమే. నేను హిందీ బాగా మాట్లాడతాను. తమిళ్ మేనేజ్ చేస్తాను.
థ్రిల్లర్ సినిమాలు చేయరా?
ప్రస్తుతం చేస్తున్న 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమా నా తొలి థ్రిల్లర్
చిరంజీవి నటించిన ఫేవరెట్ సినిమా
రౌడీ అల్లుడు నా ఫేవరెట్ సినిమా.