రిలేషన్ షిప్ లో లేని హీరోయిన్లు చాలా తక్కువగా ఉంటారు. చాలామంది ముద్దుగుమ్మలు తమ పాపులారిటీతో సంబంధం లేకుండా రిలేషన్ షిప్స్ కొనసాగిస్తూనే ఉంటారు. తను కూడా డేటింగ్ లో ఉన్నానని తెలిపింది హీరోయిన్ ఫరియా అబ్దుల్లా.
ఓటీటీ షోకు సంబంధించిన ప్రోమోలో ఈ విషయాన్ని బయటపెట్టింది. తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, అతడు దాదాపు తనలానే 6 అడుగులున్నాడని చెప్పుకొచ్చింది. చాలా సీరియస్ గా తన డేటింగ్ విషయాన్ని ఆమె బయటపెట్టింది. అయితే అంతలోనే నవ్వుతూ అదంతా ఉత్తిదే అంటోంది.
“ఏ హీరోయిన్ ను అడిగినా అందరూ ఒకటే చెబుతారు. బాయ్ ఫ్రెండ్ లేడు, రిలేషన్ షిప్ లో లేం అని చెబుతుంటారు. నాకెందుకో కొత్తగా ట్రై చేయాలనిపించింది. అందుకే అలా చెప్పాను.”
ఇదీ ఫరియా చెప్పిన సమాధానం. ఆమె ఆన్సర్ చెప్పేసింది కానీ, సోషల్ మీడియా దాన్ని నమ్మడం లేదు. గతంలో ప్రేమలు-పెళ్లిళ్లపై ఫరియా చెప్పిన స్టేట్ మెంట్స్ ను వాళ్లు బయటకు తీస్తున్నారు.
జోడియన్ నూరాబ్ అనే ఓ ఆర్టిస్ట్ తో ఆమె రిలేషన్ షిప్ లో ఉన్నట్టు గతంలోనే కథనాలొచ్చాయి. తనకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని గతంలో స్వయంగా ఫరియా ప్రకటించింది. అంతేకాదు, ఇండస్ట్రీకి దగ్గరగా ఉన్న ఓ వ్యక్తితో ఆమె డేటింగ్ లో ఉన్నట్టు, అతడు పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించినట్టు కథనాలొచ్చాయి.