ఒకరిపై ఒకరు సెటైర్లు.. కె-ర్యాంప్ ఇది

కిరణ్ అబ్బవరం హీరోగా కె-ర్యాంప్ సినిమా పూజాకార్యక్రమాలతో లాంచ్ అయింది. పనిలోపనిగా టైటిల్ కూడా రిలీజ్ చేశారు

నిర్మాత దర్శకుడిపై సెటైర్ వేస్తాడు.. దర్శకుడొచ్చి ఏకంగా హీరోపై సెటైర్ వేస్తాడు.. హీరో, నిర్మాతపై సెటైర్ వేస్తాడు.. ఇలా ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటూ ఫన్నీగా టైటిల్ ప్రకటన వీడియో విడుదల చేశారు. అదే కె-ర్యాంప్.

కిరణ్ అబ్బవరం హీరోగా కె-ర్యాంప్ సినిమా పూజాకార్యక్రమాలతో లాంచ్ అయింది. పనిలోపనిగా టైటిల్ కూడా రిలీజ్ చేశారు. దిల్ రాజు క్లాప్ తో మొదలైన ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన యుక్తి తరేజా హీరోయిన్ గా నటించబోతోంది.

ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమాకు నాని దర్శకుడు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన లాంటి సినిమాలు తీసిన రాజేష్ దండ, హాస్య మూవీస్ బ్యానర్ పై ఈ కె-ర్యాంప్ ను నిర్మిస్తున్నాడు. చేతన్ భరధ్వాజ్ సంగీత దర్శకుడు.

రీసెంట్ గా ‘క’ సినిమాతో హిట్ కొట్టాడు కిరణ్ అబ్బవరం. అందుకే సెంటిమెంట్ గా, తన కొత్త సినిమాను కూడా ‘కె’ అనే అక్షరంతోనే మొదలయ్యేలా చూసుకున్నాడు. ఈ సినిమా టైటిల్ ను చాన్నాళ్ల కిందటే గ్రేట్ ఆంధ్ర బయటపెట్టిన సంగతి తెలిసిందే.

One Reply to “ఒకరిపై ఒకరు సెటైర్లు.. కె-ర్యాంప్ ఇది”

Comments are closed.