సీమ‌లో నాగ‌బాబు స‌భల వెనుక ర‌హ‌స్యం!

జ‌న‌సేన రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప‌వ‌న్‌క‌ల్యాణ్ సొంత అన్న నాగ‌బాబు పుంగ‌నూరు ప‌ర్య‌ట‌న ప్రాధాన్యం సంత‌రించుకుంది.

జ‌న‌సేన రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప‌వ‌న్‌క‌ల్యాణ్ సొంత అన్న నాగ‌బాబు పుంగ‌నూరు ప‌ర్య‌ట‌న ప్రాధాన్యం సంత‌రించుకుంది. రాయ‌ల‌సీమ‌లో జ‌న‌సేన బ‌లం ఏపాటిదో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. రాయ‌ల‌సీమ అంత‌టికి తిరుప‌తి, రైల్వేకోడూరు నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన పోటీ చేసి, టీడీపీ పుణ్య‌మా అని రెండు చోట్ల గెలుపొందింది. ఇద్ద‌రు అభ్య‌ర్థులు కూడా ప‌క్క పార్టీల నుంచి అరువు తెచ్చుకున్నోళ్లే.

తాజాగా పుంగ‌నూరులో జ‌న‌సేన బ‌హిరంగ స‌భ నిర్వ‌హించ‌డం, నాగ‌బాబు తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. అస‌లు బ‌ల‌మే లేని పుంగ‌నూరులో జన‌సేన స‌భ ఎందుకు నిర్వ‌హించిందో ఎవ‌రికీ అర్థం కాని ప్ర‌శ్న‌. లోతుగా ఆలోచిస్తే, జ‌న‌సేన భారీ వ్యూహంతోనే రాయ‌ల‌సీమ‌పై దృష్టి సారించింద‌ని తెలుస్తోంది. జ‌న‌సేన వ‌ర్గాల క‌థ‌నం మేర‌కు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగు చూశాయి.

రాయ‌ల‌సీమ‌లో బ‌లిజ‌లు మొద‌టి నుంచి టీడీపీతోనే ఎక్కువ‌గా రాజ‌కీయ ప్ర‌యాణం సాగిస్తున్నారు. కోస్తాలో ఒక్కోసారి, ఒక్కో ర‌కంగా కాపు సామాజిక వ‌ర్గం రాజ‌కీయంగా వుంటూ వ‌స్తోంది. ప్ర‌స్తుతానికి కోస్తాలో జ‌న‌సేన‌తోనే మెజార్టీ కాపులు వుంటున్నారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో చంద్ర‌బాబు పొత్తు పెట్టుకోడానికి ప్ర‌ధాన కార‌ణం కూడా అదే. ప‌వ‌న్‌ను ద‌గ్గ‌రికి తీస్తే, కాపులంతా టీడీపీ వెంట ప్ర‌యాణం చేస్తార‌నే న‌మ్మ‌క‌మే ఎన్నిక‌ల్లో నిజమైంది.

ఈ నేప‌థ్యంలో రాయ‌ల‌సీమ‌లో భిన్న‌మైన రాజ‌కీయ ప‌రిస్థితి. జ‌న‌సేన ఉన్న‌ప్ప‌టికీ, బ‌లిజ‌లు మాత్రం టీడీపీ వైపే మొగ్గు. ఈ విష‌యాన్ని ప‌సిగట్టిన జ‌న‌సేన నాయ‌కులు రాయ‌ల‌సీమ‌లో కూడా బ‌లిజ సామాజిక వ‌ర్గాన్ని త‌మ వైపు తిప్పుకునే క్ర‌మంలో విస్తృతంగా స‌భ‌లు, స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. అందులోనూ రెచ్చ‌గొడితే, రెచ్చిపోయే సామాజిక బ్యాచ్ ఒక‌టుంద‌ని జ‌న‌సేన ముఖ్య నాయ‌కుల న‌మ్మ‌కం.

టీడీపీతో బ‌దులు త‌మ వెంటే బ‌లిజ సామాజిక వ‌ర్గం మొత్తాన్ని తిప్పుకునే క్ర‌మంలోనే పుంగ‌నూరులో నాగ‌బాబు స‌భ‌ను చూడాల్సి వుంటుంది. జ‌న‌సేన‌ను కోస్తాలో కాపుల మాదిరిగా, రాయ‌ల‌సీమ‌లో బ‌లిజ‌లు త‌మ పార్టీగా భావించేలా చేయాల‌ని వ్యూహం ర‌చించిన‌ట్టు తెలుస్తోంది. జ‌న‌సేన మ‌ద్ద‌తు ఇస్తేనే, టీడీపీకైనా, బీజేపీకైనా కాపు, బ‌లిజ‌లు ఓట్లు వేసేలా మ‌లుచుకోవాల‌ని ఆ పార్టీ నాయ‌కులు ప‌థ‌క ర‌చ‌న చేసిన‌ట్టు ఆ పార్టీ వ‌ర్గాలు చెప్తున్నాయి. ఈ వ్యూహంలో జ‌న‌సేన ఏ మేర‌కు విజ‌యం సాధిస్తుందో చూడాలి.

10 Replies to “సీమ‌లో నాగ‌బాబు స‌భల వెనుక ర‌హ‌స్యం!”

  1. నువ్వేమో జనసేన వ్యూహం అంటున్నారు. ? మీ paytm కుక్కలు నాగబాబు మీద పడి ఏడుస్తూ unnaru

  2. నేను : పవనాలు, అధికారంలోకి వచ్చిన వెంటనే, సుగాలి ప్రీతీ కేసు ని పికప్ చేసి వెంటనే దోషులని అరెస్ట్ చేసి శిక్ష పడేట్టు చేస్తాం..అన్నారు కదా. ఎంత వరుకు వచ్చింది.. ?

    వాడు:.. …………

  3. నేను : పవనాలు, అధికారంలోకి వచ్చిన వెంటనే, సుగాలి ప్రీతీ కేసు ని పికప్ చేసి వెంటనే దోషులని అరెస్ట్ చేసి శిక్ష పడేట్టు చేస్తాం..అన్నారు కదా. ఎంత వరుకు వచ్చింది.. ?

    వాడు:..

  4. నేను : పవనాలు, అధికారంలోకి వచ్చిన వెంటనే, సు.గా.లి ప్రీ.తీ కేసు ని పికప్ చేసి వెంటనే దోషులని అరెస్ట్ చేసి శిక్ష పడేట్టు చేస్తాం..అన్నారు కదా. ఎంత వరుకు వచ్చింది.. ?

    వాడు:.. …………

  5. నేను : పవనాలు, అధికారంలోకి వచ్చిన వెంటనే, సు…గా…లి ప్రీ…తీ కే..సు ని పికప్ చేసి వెంటనే దోషులని అరె…స్ట్ చేసి శి….క్ష పడేట్టు చేస్తాం..అన్నారు కదా. ఎంత వరుకు వచ్చింది.. ?

    వాడు:.. …………

Comments are closed.