సంక్రాంతికి రిలీజైన 3 సినిమాలకూ టికెట్ రేట్లు పెంచుకున్నారు. ఇప్పుడు మరోసారి రేట్లు పెంచితే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? ఈ అనుమానం తండేల్ టీమ్ కు కూడా ఉంది. అలా అని రేట్లు పెంచకుండా ఉండలేని పరిస్థితి.
అందుకే ఆంధ్రాలో టికెట్ రేట్ల పెంపును నామమాత్రం చేయాలని ఆలోచిస్తున్నారు. అంటే, టికెట్ రేట్లు పెంచుతారు కానీ భారీగా పెరగవు. ఇంకా చెప్పాలంటే, ప్రేక్షకుడికి నొప్పి తెలియకుండా పెంపు ఉంటుందన్నమాట.
నిజానికి నాగచైతన్య సినిమాలకు టికెట్ రేట్లు పెంచాల్సిన అవసరం లేదు. కానీ తండేల్ సినిమాకు మాత్రం పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే, కథపై నమ్మకంతో ఈ సినిమాకు నాగచైతన్య మార్కెట్ కు మించి ఖర్చు పెట్టేశాం అంటున్నాడు నిర్మాత బన్నీ వాసు.
“తండేల్ సినిమాకు రూ.80 కోట్లు పెట్టాం, అందుకే టికెట్ రేట్ల పెంపు కోసం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎంతవరకు సక్సెస్ అవుతానో నాకు తెలియదు. ఎందుకంటే, టికెట్ రేట్లపై చర్చ హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ రేట్ల పెంపునకు అనుమతి వచ్చినా రీజనబుల్ గానే పెంచుతాం.”
ప్రస్తుతానికి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపుపై ఎలాంటి ఆశ లేదని, అందుకే తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించడం లేదని క్లారిటీ ఇచ్చాడు బన్నీ వాసు. ఇక బెనిఫిట్ షోల విషయానికొస్తే, నైజాంలో తండేల్ కు ఎలాగూ ఆ వెసులుబాటు లేదు. కనీసం ఏపీలోనైనా తీసుకుంటారామో చూడాలి.
evvaru chudaru.
ఎవరు ఖర్చు పెట్టామన్నారు
Nine, zero, one, nine, four, seven, one, one, nine, nine, nvc