తిరుప‌తిలో టీడీపీ, జ‌న‌సేన‌కు వైసీపీ షాక్‌!

తిరుప‌తి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి టీడీపీకి గ‌ట్టి షాక్ ఇచ్చింది.

తిరుప‌తి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి టీడీపీకి గ‌ట్టి షాక్ ఇచ్చింది. ఎలాగైనా డిప్యూటీ మేయ‌ర్ ప‌ద‌విని ద‌క్కించుకోవాల‌ని తిరుప‌తిలో ప్ర‌త్య‌ర్థుల ఆస్తుల‌పైకి బుల్డోజ‌ర్ల‌ను పంపే కొత్త సంప్ర‌దానికి టీడీపీ, జ‌న‌సేన తెర తీశారు. త‌మ వైపు రాక‌పోతే, ఆస్తుల్ని ధ్వంసం చేస్తామ‌ని వైసీపీ కార్పొరేట‌ర్ల‌ను తీవ్ర‌స్థాయిలో టీడీపీ, జ‌న‌సేన నాయ‌కులు హెచ్చ‌రించారు. ఈ ర‌కంగా వైసీపీ అభ్య‌ర్థి శేఖ‌ర‌రెడ్డి భ‌వ‌నాల‌పైకి బుల్డోజ‌ర్ల‌ను పంపారు. కొంత మేర‌కు కూల్చారు. దీంతో అత‌ను ఆస్తుల్ని కాపాడుకునేందుకు టీడీపీ కండువా క‌ప్పుకున్నారు.

అలాగే మిగిలిన కార్పొరేట‌ర్ల ఆస్తుల‌కు కూడా ఇదే గ‌తి ప‌డుతుంద‌ని హెచ్చ‌రించారు. అయిన‌ప్ప‌టికీ డిప్యూటీ మేయ‌ర్ ప‌ద‌విని ద‌క్కించుకునేంత బ‌లాన్ని వైసీపీ నిలుపుకుంది. ఈ నేప‌థ్యంలో చిత్తూరులో ఓ లాడ్జీలో ఉన్న వైసీపీ కార్పొరేట‌ర్ల‌ను ఇవాళ్టి ఎన్నిక‌కే హాజ‌రు కాకుండా చేసేందుకు తిరుప‌తి ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీ‌నివాసులు త‌న‌యుడు మ‌ద‌న్‌, టీడీపీ నాయ‌కులు ప్ర‌య‌త్నించారు. లాడ్జీకి వెళ్లి, ఎన్నిక‌కు వెళ్లేందుకు వీల్లేద‌ని బెదిరించారు.

ఈ విష‌యం తెలిసి ఆ లాడ్జీ వ‌ద్ద‌కు వైసీపీ తిరుప‌తి ఇన్‌చార్జ్ భూమ‌న అభిన‌య్ వెళ్లారు. టీడీపీ, జ‌న‌సేన నాయ‌కులను ప‌ద్ధ‌తి మార్చుకోవాల‌ని హెచ్చ‌రించారు. ఇలాంటి రాజ‌కీయాలే చేయ‌ద‌లుచుకుంటే, రాబోయే రోజుల్లో తీవ్ర ప‌రిణామాలుంటాయ‌ని ఆయ‌న హెచ్చ‌రించ‌డంతో టీడీపీ, జ‌న‌సేన నేత‌లు త‌గ్గారు. దీంతో అక్క‌డి నుంచి 15 మంది కార్పొరేట‌ర్ల‌ను తిరుప‌తికి తీసుకెళ్లారు.

అనంత‌రం ఎస్వీ యూనివ‌ర్సిటీలో జ‌రిగే ఎన్నిక‌కు బ‌స్సులో వెళుతున్న వైసీపీకి చెందిన 8 మంది కార్పొరేట‌ర్ల‌ను టీడీపీ , జ‌న‌సేన నాయ‌కులు కిడ్నాప్ చేశారు. ఇదే సంద‌ర్భంలో వైసీపీ వ్యూహాత్మ‌కంగా ఆలోచించింది. టీడీపీకి కేవ‌లం 23 మంది బ‌ల‌మే వుండ‌డంతో కోరం లేక ఎన్నిక వాయిదా ప‌డింది. ఈ ప‌రిణామాన్ని టీడీపీ, జ‌న‌సేన నాయ‌కులు అస‌లు ఊహించ‌లేదు. వైసీపీకి ఎక్స్ అఫీషియో స‌భ్యుల‌తో క‌లిపి 27 మంది ఉన్నారు. ఎన్నిక స‌వ్యంగా జ‌రిగి వుంటే వైసీపీ డిప్యూటీ మేయ‌ర్ ప‌ద‌విని ద‌క్కించుకునేది. అయితే అధికారాన్ని అడ్డం పెట్టుకుని, గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా తిరుప‌తిలో అరాచ‌కానికి పాల్ప‌డ్డా ఫ‌లితం లేక‌పోయింది.

ఇవాళ్టి వ‌ర‌కు వ్ర‌తం చెడ్డా, ఫ‌లితం ద‌క్క‌లేద‌నే సామెత మాదిరిగా టీడీపీ, జ‌న‌సేనల‌కు ఆశించిన ఫ‌లితం రాలేదు. రేపు ఏం జ‌రుగుతుంద‌నేది త‌ర్వాత విష‌యం. ఎటూ బుల్డోజ‌ర్ పాల‌న‌కు పాల్ప‌డుతారు. శేఖ‌ర‌రెడ్డిని లోబ‌రుచుకున్న‌ట్టుగా, మ‌రికొంద‌రిని భ‌య‌పెట్టి త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకోవ‌చ్చు. కానీ నైతికంగా మాత్రం టీడీపీ, జ‌న‌సేన తిరుప‌తిలో దారుణంగా దెబ్బ‌తిన్నాయ‌న్న చ‌ర్చ‌కు తెర‌లేచింది.

21 Replies to “తిరుప‌తిలో టీడీపీ, జ‌న‌సేన‌కు వైసీపీ షాక్‌!”

      1. ఓహో జనాలు గుంపులుగా వచ్చి మన సాక్ష్యత్తు మహిళ కి “గుద్ద దె0గి పంగనామాలు పెట్టారు అనుకున్నా.. కాళ్ళు కూడా విరగ్గొట్టారా.. మంచిది.. ఇక ఆడి పెళ్ళాం కి పండగే అయితే

  1. ముప్పయేళ్ల కల చెదిరిపోయాక ఇలాంటివి అన్ని షొక్స్ కిందే లెక్క లే తమరికి ..

Comments are closed.