తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోడానికి ఇంకెంత కాలం తీసుకుంటారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సుమారు పది మంది తమ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారని, వాళ్లపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇదే విషయమై గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లతో కలిసి విచారిస్తామని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్‌లతో కూడిన బెంచ్ పేర్కొంది.
ఈ సందర్భంగా తెలంగాణ స్పీకర్, అసెంబ్లీ సెక్రటరీ తరపున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదిస్తూ …ఫిరాయింపుల వ్యవహారాల్లో స్పీకర్ తొందర పాటు నిర్ణయాలు తీసుకోవద్దని గతంలో సర్వోన్నత న్యాయస్థానం చేసిన కామెంట్స్‌ను ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అందువల్ల స్పీకర్‌కు ఇంకా కొంత సమయం కావాలని ఆయన కోరారు.
ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోడానికి ఇంకెంత సమయం కావాలని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. మహారాష్ట్రలో మాదిరిగా ఎమ్మెల్యేల పదవీ కాలం అయ్యే వరకూ ఎదురు చూస్తారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. స్పీకర్‌ను అడిగి చెప్తానని న్యాయవాది అనడంతో, కేసు విచారణను వాయిదా వేసింది. ఇదే అంశంపై దాఖలైన పిటిషన్లపై ఈ నెల 10 విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.
why SC interfearing with State rights? not good , speaker is supreme as far as state matter involved
వేలకోట్లు ప్రజాధనం దోచేసినోళ్ల కేసు లు కోల్డ్ స్టోరేజ్ ఉంటాయి అవి ఎందుకు వున్నాయి ఎప్పుడు విచారణ జరిగి నేరస్తులకు శిక్షలు పడతాయి అక్రమ సొమ్ము ఎప్పుడు రికవరీ చేస్తారో ప్రజలకు చెబితే బాగుంటుంది