టైటిల్ మార్చి మరీ రీ-రిలీజ్

ఉన్నఫలంగా వాలంటైన్స్ డే పోటీలోకి వచ్చి చేరాడు హీరో సిద్ధు జొన్నలగడ్డ.

ఉన్నఫలంగా వాలంటైన్స్ డే పోటీలోకి వచ్చి చేరాడు హీరో సిద్ధు జొన్నలగడ్డ. ఇప్పటికే ఉన్న తండేల్, లైలా లాంటి సినిమాలకు పోటీగా తన సినిమాకు కూడా విడుదలకు సిద్ధం చేశాడు.

అయితే ఇదేదో సిద్ధూ నుంచి వస్తున్న కొత్త సినిమా కాదు. ఐదేళ్ల కిందటొచ్చిన “కృష్ణ అండ్ హిజ్ లీల” సినిమాను మరోసారి రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ 2 విషయాలు చెప్పుకోవాలి.

మొదటిది ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అవ్వడం ఇదే తొలిసారి. గతంలో నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు. కాబట్టి మేకర్స్ దీన్ని స్ట్రయిట్ థియేట్రికల్ రిలీజ్ అంటున్నారు. ఇక రెండో విషయం ఏంటంటే, ఈ సినిమాకు టైటిల్ మార్చేశారు.

“కృష్ణ అండ్ హిజ్ లీల” అనే టైటిల్ కాకుండా “ఇట్స్ కాంప్లికేటెడ్” అనే టైటిల్ తో సినిమాను ఫ్రెష్ గా రిలీజ్ చేస్తున్నారు. టైటిల్ ఎందుకు మార్చామో దయచేసి అడగొద్దని, చెప్పడం కష్టమని అంటున్నాడు నిర్మాత రానా.

కొన్నిరోజుల కిందట రానా చిట్ చాట్ షోలో ఈ సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. ఆ టైమ్ లో పడిన కష్టాలు, సురేష్ బాబు కొర్రీల గురించి ఫన్నీగా చెప్పుకొచ్చాడు సిద్ధు జొన్నలగడ్డ. శ్రద్ధా శ్రీనాధ్, సీరత్ కపూర్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను 14న రిలీజ్ చేస్తున్నారు.

4 Replies to “టైటిల్ మార్చి మరీ రీ-రిలీజ్”

  1. అంటే తండేల్, లైలా సినిమాలు ఫట్టని ముందే డిసైడ్ అయిపోయారా?

    ఆ సినిమాల ఫలితంపై అంత తొందరెందుకు ?

Comments are closed.