రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాలో 2 క్యామియోలున్నాయి. ఓ గెస్ట్ రోల్ లో సిద్ధు జొన్నలగడ్డ నటించగా, మరో చిన్న బిట్ లో దేవిశ్రీ ప్రసాద్ కనిపించాడు. వేరే మ్యూజిక్ డైరక్టర్ సాంగ్ లో దేవిశ్రీని పెట్టడం వెనక కారణాన్ని దర్శకుడు హరీశ్ శంకర్ బయటపెట్టాడు.
“దేవిశ్రీ ఓ మ్యూజిక్ డైరక్టర్ గా కంటే, నన్ను విపరీతంగా అభిమానించే నా స్నేహితుడు. బ్యాక్ గ్రౌండ్ లో హెవీ రిథమ్ వచ్చినప్పుడు హీరోను చూపిద్దామనేది ఆలోచన. దానికి ముందు వచ్చేదాంట్లో ఎవరైనా గెస్ట్ ఉంటే బాగుంటుదనుకున్నాం. టైమ్ లేదు కదా నన్నే చేయమన్నారు. కెమెరా ముందుకు రాకుండా తప్పించుకోవడానికి ఏం చేయాలో తెలియక, దేవిశ్రీ ప్రసాద్ కు ఫోన్ చేశాను. మరుసటి రోజు వచ్చేయమని చెప్పాను. ఒక రోజు కూడా టైమ్ ఇవ్వలేదని అడిగాడు. ఫ్రెండ్ షిప్ డే నువ్వు రావాల్సిందే అన్నాను. అడిగిన వెంటనే వచ్చేశాడు. వేరే మ్యూజిక్ డైరక్టర్ సాంగ్ లో, మరో పెద్ద మ్యూజిక్ డైరక్టర్ చేయడం దేవిశ్రీ విశాల హృదయం.”
సిద్ధు జొన్నలగడ్డను తీసుకోవడంపై కూడా వివరణ ఇచ్చాడు. హీరోతో సమానమైన సన్నివేశం కోసం మరో హీరో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో సిద్ధూను తీసుకున్నారట.
సినిమాకు మిక్స్ డ్ టాక్ వస్తున్న విషయాన్ని అంగీకరించాడు హరీశ్ శంకర్. అది తను ముందే ఊహించానని, అయితే రోజురోజుకు పాజిటివ్ టాక్ పెరుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.
Call boy jobs available 8341510897
Call boy works 8341510897
veedoka package gadi director ..veedu kuda jagan meeda satires veyyadame
జనం పట్టించుకోరు
Vc available 9380537747