లైగర్… ఇటీవలి కాలంలో దారుణమైన డిజాస్టర్. అరి వీర హైప్ తెచ్చుకుని, అతి ఘోర పరాజయం పొందిన సినిమా. ఇటీవలి కాలంలో ఏ యంగ్ హీరో కూడా ఇలాంటి దారుణమైన ఫ్లాప్ ను చూడలేదు.
ఆ సంగతి అలా వుంచితే దర్శకుడు పూరి ఎందుకు ఇలా తీసాడు. ఆయన తెలివితేటలు అన్నీ ఏమైపోయాయి, ఆయన స్టామినా ఏమైంది..అసలు ఇది పూరి సినిమాయేనా? అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. దీనికి సాధారణ జనాలు కూడా భలే వ్యాఖ్యానాలు చెబుతున్నారు.
అవును..నిజమే. ఇది పూరి సినిమా కాదు. పూరి సినిమా అయితే విచ్చలవిడిగా డ్రగ్స్ వాడకాలు చూపించాలి కదా.
పూరి సినిమా అయితే హింసా దృశ్యాలు ఒకటి రెండు అయినా చోటు చేసుకోవాలి కదా.
పూరి సినిమా అయితే అమ్మాయిలను ఎలా చూపించాలి? ఇందులో అంతలా చూపించలేదు కదా.
పూరి సినిమా అయితే ఇస్మార్ట్ శంకర్, రొమాంటిక్ సినిమాల్లొ హీరో హీరోయిన్ల రొమాన్స్ లాంటి సీన్లు వుండాలి కదా? లేవే..
పూరి సినిమా అయితే రాంబాబు సినిమాలో తమన్నాలా, ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నభానటేష్ లా వుండాలి కానీ, జస్ట్ ఓ మోడరన్ అమ్మాయిలా వుంటే ఎలా?
అసలు ఇటీవలి కాలంలో పూరి సినిమాల్లో ఫ్యామిలీతో ధైర్యంగా చూసేయగల సినిమా ఇదే కదా?
ఇలా చాలా చాలా పాయింట్లు ఎత్తి చూపిస్తున్నారు.
అసలు పూరి సినిమా ఇంతలా డిజాస్టర్ కావడానికి కేవలం సినిమా ఒక్కటే కారణం కాదు. అంతకు మించి ఇంకేదో వుంది అన్న టాక్ కూడా వినిపిస్తోంది.
ఏమైతేనేం జరగాల్సింది జరిగిపోయింది. ఇలా పోస్ట్ మార్టం రిపోర్టులే మిగులుతున్నాయి.