పవన్ ఆ కార్పోరేటర్ని పొగిడి…సీనియర్ని…?

పవన్ కళ్యాణ్ ఒక విషయంలో కచ్చితంగా ఉంటారని చెబుతారు. అదేంటి అంటే పక్కా  వైసీపీ వ్యతిరేక విధానం. ఈ విషయంలో ఆయన గత ఎనిమిదేళ్ళుగా ఎక్కడా అడుగు వెనక్కి వేయలేదు. ఆయన సిద్ధాంత బద్ధతకు…

పవన్ కళ్యాణ్ ఒక విషయంలో కచ్చితంగా ఉంటారని చెబుతారు. అదేంటి అంటే పక్కా  వైసీపీ వ్యతిరేక విధానం. ఈ విషయంలో ఆయన గత ఎనిమిదేళ్ళుగా ఎక్కడా అడుగు వెనక్కి వేయలేదు. ఆయన సిద్ధాంత బద్ధతకు ఇదే అసలైన నిదర్శనం అని ప్రత్యర్ధులతో పాటు ఎరిగిన వారు అంతా సెటైరికల్ గా అంటారు.

తాజాగా ఒక విషయంలోనూ పవన్ తన సిద్ధాంత బద్ధతను మరోసారి రుజువు చేసుకున్నారు అనే అంటున్నారుట. జగన్ ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధాన్ని ప్రకటిస్తే జనసేనలో ఉన్న బొలిశెట్టి సత్యనారాయణ జగన్ నిర్ణయాన్ని మెచ్చుకున్నారు. ఆయన రాజకీయాల కంటే కూడా పర్యావరణ ప్రేమికుడిగా కూడా ఎక్కువగా కనిపిస్తారు. అలా ఆయన చాలా వర్క్ చేశారు కూడా.

అందువల్లనే ఆయన ప్లాస్టిక్  నిషేధాన్ని వైసీపీ ప్రభుత్వం ప్రకటిస్తే ఏమాత్రం సంకోచం లేకుండా స్వాగతించారు. అయితే ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలో పవన్ కళ్యాణ్ పార్టీ అధినేత హోదాలో భారీ స్టేట్మెంట్ విడుదల చేశారు. అందులో జగన్ని ఆయన ప్రభుత్వాన్ని గట్టిగానే విమర్శించారు

ఒక వైపు రుషికొండలను ద్వంసం చేస్తున్నారని, మరో వైపు విశాఖ చుట్టూ వినాశకరమైన పరిశ్రమలు ఉన్నాయని వీటి విషయంలో చర్యలు తీసుకోకుండా ప్లాస్టిక్ నిషేధం అంటూ కొత్తగా మాట్లాడుతున్నారని విమర్శించారు. జగన్ సర్కార్ డబుల్ స్టాండర్స్ కి ఇది మచ్చుతనక అని పవన్ తన స్టేట్మెంట్ లో విరుచుకుపడ్డారు.

ఇక విశాఖలో జనసేనకు ఇద్దరు కార్పోరేటర్లు ఉన్నారు. అందులో పీతల మూర్తి యాదవ్ నిత్యం వైసీపీ మీద విమర్శలు చేస్తూ ఉంటారు. ఇపుడు ఆయన పవన్ కి తెగ నచ్చేశారు అంటున్నారు. పనిలో పనిగా ఆయన విశాఖ సమస్యల మీద చాలా బాగా పోరాడుతున్నారని పవన్ అభినందించారుట. అంటే సీనియర్ నేత బొలిశెట్టికి ఇది ఇండైరెక్ట్ రిటార్టేనా అని పార్టీ లోపలా బయటా చర్చ సాగుతోంది. 

ఇంతకీ జనసేన సభ్య సమాజానికి దీని వల్ల అందిన సందేశం ఏంటి అంటే వైసీపీ సర్కార్ మంచి పనులు చేసినా మెచ్చ రాదు అనేనని అంటున్నారుట‌.