Advertisement

Advertisement


Home > Movies - Movie News

జగన్ నే రైట్..నేనే తప్పు

జగన్ నే రైట్..నేనే తప్పు

అనుభవం అయితే తప్ప తత్వం బోధపడదు అన్నది సామెత. సినిమా రంగం జనాలకు ఇప్పుడు అదే జరుగుతోంది. వైఎస్ జగన్ ఆంధ్రలో సినిమా టికెట్ రేట్లను తగ్గించినపుడు నానా హంగామా జరిగిపోయింది. 

అలా హంగామా చేసిన వారిలో ట్విట్టర్ వీరుడైన ఆర్జీవీ ఒకరు. పైగా ఆయన వర్మ వెడలె రవితేజము లలరగ అన్నట్లుగా అమరావతి వెళ్లి అప్పటి మంత్రి పేర్ని నాని ని కలిసి మరీ వచ్చారు. సినిమా జనాలు మీటింగ్ ల మీద మీటింగ్ లు పెట్టారు. ఆఖరికి మెగాస్టార్ చిరంజీవి దౌత్యం పుణ్యమా అని టికెట్ రేట్లు పెరిగాయి.

నిజానికి రేట్లు తగ్గించినపుడు అందరూ చేసింది ఏమిటంటే సైలంట్ గా యూనిఫారమ్ గా 100 రూపాయలకు విక్రయించడం. అలాగే పెద్ద మొత్తాలు సంపాదించిన సినిమాలు వున్నాయి. ఆ మేరకు పెంచమని అడిగితే సరిపోయేది. అలా కాకుండా మరి కొంచెం ఎక్కువే పెంచేలా చేసుకున్నారు. అదీ చాలక స్పెషల్ రేట్లు తెచ్చుకున్నారు.

దాంతో ఇప్పుడేమయింది. జనం థియేటర్లకు రావడానికే భయపడుతున్నారు. దాంతో తక్కువ రేట్లకే సినిమా అనే నినాదం కామన్ అయింది. అయినా కూడా జనం రావడం లేదు. ఇప్పుడు ఇండస్ట్రీ ముందున్న తక్షణ కర్తవ్యం ఒక్కటే వంద రూపాయల కామన్ రేటును ఏదో విధంగా ఫిక్స్ చేయించుకోవాలి.

అదలా వుంటే టికెట్ రేట్లు తక్కువ వున్నపుడు ట్వీట్ల యుద్దం చేసిన రామ్ గోపాల్ వర్మ తమదే తప్పు అంటున్నారు. జగన్ నే రైటు అంటున్నారు. జనం ఎఫెర్ట్ చేయలేరు అందుకే రేట్లు తగ్గించామని అంటే తాము తప్పుగా అనుకున్నామని, కానీ ఇప్పుడు జగన్ చెప్పిందే కరెక్ట్ అని అర్థం అయిందని వర్మ అంగీకరించారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?