కల్కి.. ఓన్లీ ట్రైలర్‌నే ఆప్షన్!

కల్కి సినిమా ట్రైలర్ రేపు రాబోతోంది. ఇప్పటి వరకు కల్కి సినిమా మీద వున్నవి అంచనాలు. వార్తలు.. మాత్రమే. అసలు కల్కి ఎలా వుండబోతోంది అన్నది చెప్పబోయేది ట్రైలర్ మాత్రమే. టెక్నికల్ గా సినిమా…

కల్కి సినిమా ట్రైలర్ రేపు రాబోతోంది. ఇప్పటి వరకు కల్కి సినిమా మీద వున్నవి అంచనాలు. వార్తలు.. మాత్రమే. అసలు కల్కి ఎలా వుండబోతోంది అన్నది చెప్పబోయేది ట్రైలర్ మాత్రమే. టెక్నికల్ గా సినిమా చాలా హై గా వుంటుంది. అందులో అణు మాత్రం సందేహం వుండడానికి అవకాశం లేదు. దర్శకుడు నాగ్ అశ్విన్ వర్క్ మీద నమ్మకం, సినిమాకు పని చేసిన మంచి టెక్నీషియన్ల సమర్ధత మీద నమ్మకం. సినిమాకు పెట్టిన ఖర్చు. ఇవన్నీ కలిసి సినిమాను టెక్నికల్ గా అస్సలు వెలితి లేకుండా చూస్తాయి.

ఇక మిగిలింది కంటెంట్. ఇప్పటి వరకు కంటెంట్ ఏమిటి? ఎలా వుంటుంది? అన్నది ఊహాగానాలే తప్ప సరైన ధృవీకరణ లేదు. అదే సమయంలో ఈ కంటెంట్ ను దర్శకుడు ఏ విధంగా ప్రెజెంట్ చేయబోతున్నారు అన్నది కూడా కీలకమే. ఒక్కో దర్శకుడికి ఒక్కో స్టయిల్ వుంటుంది. కేజిఎఫ్, సలార్ లాంటి సీరియస్ హెవీ యాక్షన్ మూవీ జానర్ లో వుంటుందా? అన్నది అనుమానమే. ఎందుకంటే ఈ తరహాలో నాగ్ అశ్విన్ చేసి వుండకపోవచ్చు.

మొదటి నుంచీ పిల్లలకు నచ్చే కంటెంట్ గా ప్రెజెంట్ చేస్తూ వస్తున్నారు. బుజ్జీ అంటూ హడావుడి చేస్తున్నారు. లైటర్ మూవ్ మెంట్స్ చూపిస్తూ వస్తున్నారు. వదిలిన రెండు యానిమేటెడ్ పరిచయ ఎపిసోడ్ లు కూడా అదే విధంగా వున్నాయి. అంటే సినిమా ఇటు పిల్లలకు, అటు పెద్దలకు నచ్చేలా చేస్తున్నారా? అన్నది తెలియాల్సి వుంది.

ప్రభాస్ ఫ్యాన్స్ ను కూడా దృష్టి పెట్టుకోవాల్సి వుంది. వారికి నచ్చే హెవీ యాక్షన్, ఎమోషన్ కూడా అవసరం. వీటన్నింటి మీద క్లారిటీ ఇచ్చేది ట్రైలర్ కట్ మాత్రమే. ట్రైలర్ కట్ అన్ని విధాలా ఆకట్టుకోవాలి. అందరినీ ఆకట్టుకోవాలి. ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే యునానిమస్ గా త్రీ స్టార్ రేటింగ్ రేంజ్ లో వుండాలి. అప్పుడే సినిమా మీద వున్న బజ్ నిలబడుతుంది.

సినిమాను అడ్వాన్స్ ల మీదే ఇస్తున్నారు. స్పెషల్ టికెట్ రేట్లు, స్పెషల్ షో లు ఎలాగూ వుంటాయి. అందువల్ల ఆర్థిక సంబంధమైన డిస్కషన్లకు తావు వుండదు. కానీ దర్శకుడికి, హీరోకి పేరు నిలబడాలి. అది కీలకం. ఇది ట్రైలర్ చాలా వరకు డిసైడ్ చేస్తుంది.