కార్తికేయ వెరీ స్వీట్ – ‘తాన్యా’

రాజా విక్రమార్క సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అవుతున్న హీరోయిన్ తాన్యా రవిచంద్రన్. 'రాజా విక్రమార్క' సినిమాలో కార్తికేయకు జంటగా నటిస్తోందీ అమ్మాయి. దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ  సరిపల్లి ని…

రాజా విక్రమార్క సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అవుతున్న హీరోయిన్ తాన్యా రవిచంద్రన్. 'రాజా విక్రమార్క' సినిమాలో కార్తికేయకు జంటగా నటిస్తోందీ అమ్మాయి. దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ  సరిపల్లి ని దర్శకుడిగా పరిచయం చేస్తూ… శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై  నిర్మించిన సినిమా 'రాజా విక్రమార్క'. ఈ సినిమా విడుదల సందర్భంగా మీడియాతో తాన్యా రవిచంద్రన్ ముచ్చటించారు.

సినిమాల్లోకి ఎలా వచ్చారు?

చెన్నైలో పీజీ చేస్తున్న సమయంలో తమిళ పరిశ్రమ నుంచి కొన్ని అవకాశాలు వచ్చాయి. ఒక్క సినిమా చేస్తానని చెప్పాను. అయితే… వరుస అవకాశాలు రావడంతో తమిళంలో వెంట వెంటనే మూడు సినిమాలు చేశా. ఆ మూడు సినిమాలు పూర్తి చేశాక… పీజీ (ఎంఏ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ – హెచ్ఆర్‌) కంప్లీట్ చేసి మళ్లీ సినిమాల్లోకి వచ్చాను.

'రాజా విక్రమార్క'లో అవకాశం 

దర్శకుడు శ్రీ సరిపల్లి చెన్నై వచ్చి కథ చెప్పారు. కథతో పాటు అందులో నా పాత్ర కూడా బాగా నచ్చింది. కథలో హీరోయిన్ రోల్ చాలా ఇంపార్టెంట్. అందుకని, ఓకే చేశా. 

బాగా ఆకట్టుకున్న అంశం

సినిమాలో కాలేజీ అమ్మాయి పాత్ర.. పైగా భరతనాట్యం డ్యాన్సర్. క్యారెక్టర్ పరంగానూ కాంతి చాలా స్ట్రాంగ్. హోమ్ మినిస్టర్ కుమార్తె అయినప్పటికీ… కాంతి చాలా సింపుల్ గా ఉంటుంది. హీరోయిన్ పాత్రలో ఈ లక్షణాలు నచ్చాయి. నేను సినిమా అంతా ఉంటాను. నాది చాలా ప్రామినెంట్ రోల్. వచ్చి వెళుతూ ఉంటుంది.

కార్తికేయతో వర్కింగ్ ఎక్స్‌పీరియ‌న్స్

హీ ఈజ్ వెరీ స్వీట్ అండ్ ఫ్రెండ్లీ. అతని నటన చాలా నేచురల్ గా ఉంటుంది. దాంతో కో-ఆర్టిస్టులు కూడా చక్కగా నటించగలరు. కార్తికేయతో వర్కింగ్ ఎక్స్‌పీరియ‌న్స్ బావుంది. అతనితో పాటు సాయి కుమార్, తనికెళ్ల భరణితో స్క్రీన్ షేర్ చేసుకోవడం గౌరవంగా భావిస్తున్నాను.