ఈ శంకర్ కు క్రాక్ ఎక్కువ

కొందరికి తిక్క ఉంటుంది. మరికొందరికి పొగరు ఉంటుంది. కానీ బూతరాజు వీర శంకర్ కు మాత్రం క్రాక్ ఉంది. క్రాక్ మూవీలో పోలీసాఫీసర్ శంకర్ గా రవితేజ ఫుల్ లెంగ్త్ మాస్ రోల్ లో…

కొందరికి తిక్క ఉంటుంది. మరికొందరికి పొగరు ఉంటుంది. కానీ బూతరాజు వీర శంకర్ కు మాత్రం క్రాక్ ఉంది. క్రాక్ మూవీలో పోలీసాఫీసర్ శంకర్ గా రవితేజ ఫుల్ లెంగ్త్ మాస్ రోల్ లో కనిపించాడు. కొద్దిసేపటి కిందట ఈ సినిమా ట్రయిలర్ రిలీజైంది.

వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ఇంట్రెస్టింగ్ గా మొదలైంది క్రాక్ ట్రయిలర్. పోలీసాఫీసర్ శంకర్ పాత్రలో రవితేజ మాస్ యాంగిల్ లో కనిపించాడు. ఒంగోలు బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ కథలో ముగ్గురు విలన్లను రవితేజ ఎలా ఎదుర్కొన్నాడనేది ఈ సినిమా కథ.

రవితేజకు ఇలాంటి పాత్రలు కొత్త కాదు, ఇలాంటి గెటప్స్ ఇంతకుముందే వేశాడు. ఇవి కాకుండా క్రాక్ లో ఇంకా కొత్తగా ఏం చూపించబోతున్నారనే విషయాన్ని మాత్రం ట్రయిలర్ లో రివీల్ చేయలేదు. పూర్తిగా మాస్ ఎలిమెంట్స్ చూపించడానికి మాత్రమే ట్రయిలర్ ను వాడుకున్నారు.

యూనిట్ మాత్రం సినిమాలో ఓ కొత్త పాయింట్ ఉందని చెబుతోంది. ఆ కొత్త పాయింట్ ఏంటనేది.. జనవరి 9న తేలిపోతుంది. ఈ సినిమాను 14న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇంకాస్త ముందుగా వస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే 9వ తేదీకే వస్తున్నారు. ఈ మేరకు కొత్త తేదీతో ఇవాళ్టి నుంచి పేపర్ యాడ్స్ కూడా మొదలైపోయాయి.

శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. తమన్ సంగీతం అందించాడు. కొత్త ఏడాదిలో కోటి ఆశలతో, సంక్రాంతి సీజన్ తొలి సినిమాగా రిలీజ్ అవుతున్న క్రాక్,  రవితేజకు అతడు ఎదురుచూస్తున్న సక్సెస్ అందివ్వాలని ఆశిద్దాం.