ఎప్పుడు, ఎందుకు, ఎవరికి జ్ఞానోదయం అవుతుందో చెప్పలేం. అయితే ఏదో ఒక దశలో, ఏదో ఒక అనుభవం తప్పకుండా జీవితానికో గుణపాఠం నేర్పుతుందనడంలో ఎలాంటి అనుమానం లేదు. తాజాగా స్టార్ హీరోయిన్ తాప్సీకి కూడా బహుశా అలాంటి జ్ఞానోదయం అయినట్టు ఆమె మాటలను బట్టి అర్థమవుతోంది.
తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్‌గా తాప్సీ గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా అభిమానుల ప్రశంసలు అందుకున్న తాప్సీ, అదే ఉత్సాహంతో బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వెళ్లారు. మహిళా క్యారెక్టర్‌కు ఇంపార్టెన్స్ ఉండేలా ఆమె ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. కాగా విహారయాత్ర కోసం మాల్దీవులు వెళ్లిన తాప్సీ అక్కడ తనదైన ప్రపంచంలో తేలాడారని చెప్పొచ్చు.
మాల్దీవుల్లో బికినీలో ఫోజులిచ్చి అభిమానుల్ని కళ్లార్పకుండా తన వైపు చూపు నిలుపుకున్నారు. అయితే బికినీలో ప్రదర్శన ఇవ్వడంపై ఆమె తన అభిప్రాయాల్ని కుండబద్దలు కొట్టినట్టు చెబుతోంది. ఇక బికినీ అందాలన్నీ కేవలం ఆఫ్ స్క్రీన్‌కే పరిమితమని ఆమె అంటున్నారు.
ఇక మీదట వెండితెరపై బికినీలో అస్సలు కనిపించనని ఆమె స్పష్టం చేశారు. చిట్టిపొట్టి దుస్తుల్లో తనను అభిమానులు ఊహించుకోలేరని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా తాప్సీ మాట్లాడుతూ జుద్వా తప్ప మరే ఇతర సినిమాల్లో బికినీలో తాను కనిపించలేదని చెప్పుకొచ్చారు. అలాగే గ్లామర్ ఫొటోల్ని సోషల్‌మీడియా వేదికగా షేర్ చేయడానికి తాను ఇష్టపడనని తెలిపారు.
ఓవర్ ఎక్స్‌ఫోజింగ్ చేసినా అభిమానులు తనను స్వీకరించరనే విషయం బాగా తెలుసన్నారు. ఈ కారణంగానే ఇక మీదట సినిమాల్లో బికినీ ధరించకూడదనే గట్టి నిర్ణయం తీసుకోవడంతో పాటు నియమం పెట్టుకున్నానన్నారు.