ఐదేళ్ల కిందటి పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఏమాత్రం క్రేజ్ ఉన్నా, ఆ ప్రాజెక్ట్ కు పాన్ ఇండియా అప్పీల్ ఇస్తున్నారు మేకర్స్. లూసిఫర్ విషయంలో అదే జరిగింది.
2019లో మలయాళంలో రిలీజైంది లూసిఫర్ సినిమా. అప్పటి ఆ సినిమా స్కేల్, సెటప్ పూర్తిగా లోకల్. చివరికి హీరో గెటప్ లో కూడా నేటివిటీ కనిపిస్తుంది. ఇప్పుడా సినిమాకు సీక్వెల్ రెడీ అయింది. పేరు ఎల్2ఈ-ఎంపురాన్.
ఈ సినిమా టీజర్ చూస్తే పూర్తిస్థాయిలో పాన్ ఇండియా ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకొని తీసినట్టు అనిపిస్తుంది. మోహన్ లాల్ హీరోగా, పృధ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు కూడా పాన్ ఇండియా లెవెల్లోనే ఉన్నాయి మరి.
“ఏదో ఒకరోజు నీ చుట్టూ ఉన్న వాళ్లంతా మోసగాళ్లు అనిపించినప్పుడు.. ఈ నాన్న లేకుంటే.. నిన్ను ఆదుకోగలిగినవాడు ఒక్కడే ఉంటాడు. అతడే స్టీఫెన్.” అనే పవర్‌ఫుల్ డైలాగ్‌తో హీరో మోహన్ లాల్ క్యారెక్టర్‌ను పరిచయం చేశారు.
లూసిఫర్ కంటే మరింత గ్రిప్పింగ్ గా ఈ సినిమా ఉంటుందంటున్నాడు దర్శకుడు కమ్ నటుడు పృధ్వీరాజ్. టొవినో థామస్, మంజు వారియర్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను మార్చి 27న విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా రిలీజ్ టైమ్ కు లూసిఫర్ విడుదలై సరిగ్గా ఆరేళ్లు అవుతుంది.
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు
తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ