సైఫ్ అలీఖాన్ పై దుండగుడు కత్తితో దాడి చేసి హత్యకు యత్నించిన కేసులో.. ఊహించని విధంగా కరీనా కపూర్ పై కథనాలు మొదలైన సంగతి తెలిసిందే. భర్త కత్తిపోట్లకు గురైనప్పుడు కరీనా సరిగ్గా స్పందించలేదని కొందరు, అసలు ఈ ఘటన వెనక కరీనా కపూర్ హస్తం ఉందని మరికొందరు స్టోరీలు అల్లడం మొదలుపెట్టారు.
దీనిపై మాజీ హీరోయిన్, అక్షయ్ కుమార్ భార్య ట్వింకిన్ ఖన్నా ఘాటుగా స్పందించింది. ప్రతి అంశానికి మహిళల్ని నిందితులుగా చూపించే మైండ్ సెట్ నుంచి బయటపడాలంటోంది. మరీ ముఖ్యంగా భార్యల్ని బ్లేమ్ చేసే సంస్కృతి ఎక్కడ్నుంచి వచ్చిందని ప్రశ్నిస్తోంది.
“సైఫ్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు, అతని భార్య ఇంట్లో లేదని కొందరు.. దాడి సమయంలో భర్తకి సహాయం చేయలేనంత మత్తులో ఉందని మరికొందరు సిల్లీ కామెంట్స్ చేస్తున్నారు. ఏ విధమైన ఆధారాలు లేకుండా ఎలా ఓ అభిప్రాయానికొస్తారు. నిందను భార్యపైకి నెట్టడానికి ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. చాలాకాలంగా ఇది అందరికీ ఇష్టమైన నమూనాగా మారిపోయింది.”
సరిగ్గా ఇలాంటి విమర్శల్నే విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మ కూడా ఎదుర్కొంటోందని,.. గ్రౌండ్ లో కోహ్లి సెంచరీ చేయకపోతే అనుష్కను తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తోంది. ఇలా ప్రతిసారి మహిళల్ని టార్గెట్ చేయడం మానుకోవాలని సూచిస్తోంది.
వేలి ముద్రలు మ్యాచ్ అవ్వడం లేదా..?
మరోవైపు ఈ కేసుకు సంబంధించి పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఘటనకు సంబంధించి షరీపుల్ ఇస్లామ్ షెజాద్ ను ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు, అతడితో సైఫ్ ఇంట్లో సీన్ రీ-కనస్ట్రక్షన్ కూడా పూర్తిచేశారు.
సైఫ్ ఇంటి నుంచి సేకరించిన వేలిముద్రలు, షెజాద్ వేలి ముద్రలు సరిపోలడం లేదంటూ వచ్చిన వాదనల్ని పోలీసులు తోసిపుచ్చుతున్నారు. అసలు ఫోరెన్సిక్ రిపోర్ట్ తమ వరకు రాలేదని స్పష్టం చేస్తున్నారు.
సీసీటీవీ ఫూటేజ్ లో కనిపిస్తున్న వ్యక్తి ముఖం, షెజాద్ ముఖం ఒకేలా లేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై కూడా పోలీసులు యాక్షన్ తీసుకుంటున్నారు. సీసీటీవీ ఫూటేజ్ ను త్రీడీ వెర్షన్ లోకి మార్చి, సరికొత్త టెక్నాలజీతో ఫేస్ రికగ్నిషన్ పరీక్షలు చేయబోతున్నారు.
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు
don’t know who was involved, but stabbing incidents after the fact are always questionable in this case. If there’s no influence of money or fame, the real culprits will be caught
హై సెక్యూరిటీ ఉన్న ప్రదేశంలో దొంగతనం జరగడం అనేదే ఉండదు. అలాంటిది ఎవడో ఆగంతకుడు చొరబడి ప్రాణాంతక దాడి చేయడం, వారికి చెందిన కార్లు ఆసుపత్రికి తీసుకొని వెళ్ళడానికి అందుబాటులో లేకపోవడం, అప్పటికే భార్యాభర్తల మధ్య ఆస్తుల విషయంలో విభేదాలు ఉండటం వంటివి సహజంగానే ఆమె మీదకి అనుమానం కలిగిస్తుంది. ఒకవేళ కరీనాపై ఇలాంటి దాడి జరిగివుంటే మొగుడు సైఫ్ నే అందరూ అనుమానించేవారు కదా!
కుర్ర కరీనా ముసలి ఖాన్ ని ఎందుకు పెళ్లి చేసుకుంది??
దాడికి సమాధానం ఇక్కడ నుండే నరక్కుంటూ వస్తే.. నిందితులు ఎవరో త్వరలో తెలిసే అవకాశం ఉంటది.
బబిత దెబ్బకి బెంబేలు ఎత్తి బాటిల్ ఎత్తిన రణధీరుడు ( పేరులో మాత్రమే). ఆవిడ ఆధ్వర్యంలో పెరిగిన పెద్ద కూతురు ఏమీ చేసిందో , ఇప్పుడు చిన్న కూతురు వంతు.. మామూలుగా ఉండదు మనతోని
సైఫ్ తో రాసలీలలు నడిపిన వాళ్ళు ఒక్కక్కళ్లు బాటకి వస్తున్నారు …