కోలీవుడ్ లో అజిత్, విజయ్ మధ్య బాక్సాఫీస్ వైరం గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు బాక్సాఫీస్ వరకే పరిమితమైన వాళ్ల వార్.. ఆ తర్వాత వ్యక్తిగత స్థాయికి కూడా చేరిందంటారు కొందరు. తమిళనాట రజనీకాంత్ తర్వాత స్థానం అజిత్ దేనని అతడి ఫ్యాన్స్, కాదు తమ హీరోనే నంబర్ వన్ అంటూ విజయ్ ఫ్యాన్స్ కొట్టుకోవడం అక్కడ కామన్.
తెలుగులో ఇద్దరు పెద్ద హీరోల ఫ్యాన్ వార్ కంటే, భయంకరంగా, అసహ్యంగా ఉంటుంది కోలీవుడ్ లో విజయ్-అజిత్ అభిమానుల మధ్య యుద్ధం. కోలీవుడ్ ను ట్రాక్ చేసే ఎవ్వర్ని అడిగినా ఈ విషయం చెబుతారు.
ఇప్పుడు మరోసారి అజిత్-విజయ్ మధ్య చిచ్చు మొదలైంది. ‘పద్మ’ అవార్డ్ వేదికగా ఈ కుమ్ములాట ప్రారంభమైంది. విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అతడి పొలిటికల్ ఎంట్రీ, ప్రస్తుత అధికార పార్టీ డీఎంకేకు గిట్టడం లేదు.
అందుకే విజయ్ పై పరోక్షంగా పైచేయి సాధించేందుకు, అతడ్ని నైతికంగా దెబ్బకొట్టేందుకు అజిత్ కు పద్మభూషణ్ అవార్డ్ ఇప్పించారనే చర్చ కోలీవుడ్ లో ఊపందుకుంది. ఇలా అవార్డులతో వివాదాలు జరగడం ఇదే తొలిసారి కాదు.
గతంలో ఎంజీఆర్, కమల్ హాసన్ పార్టీలు పెట్టినప్పుడు.. శివాజీ గణేశన్, రజనీకాంత్ లకు దాదాసాహెబ్ పాల్కే అవార్డులు ప్రకటించారని అంటారు కొందరు. అదే విధంగా ఇప్పుడు అజిత్ కు పద్మ అవార్డ్ ఇచ్చి కౌంటర్ పాలిటిక్స్ చేస్తున్నారని అంటున్నారు.
ఇక అజిత్-విజయ్ మధ్య గ్యాప్ విషయానికొస్తే.. విజయ్ పొలిటికల్ పార్టీ స్థాపించినప్పుడు అజిత్ స్పందించలేదు. అటు అజిత్, దుబాయ్ రేసులో గెలిచినప్పుడు ప్రముఖులంతా స్పందించినప్పటికీ, విజయ్ మాత్రం రియాక్ట్ అవ్వలేదు. ఇప్పుడు పద్మ అవార్డ్ వచ్చినప్పుడు సైతం విజయ్ స్పందించలేదంటున్నారు అజిత్ అభిమానులు. ఈ ఫ్యాన్ వార్స్ పక్కనపెడితే పద్మభూషణ్ అవార్డ్ కు అజిత్ అన్ని విధాలుగా అర్హుడు.
Jagan ki Bharatha ratna evvali
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు
ఎవ్వరు వీళ్ళు…ప్రేక్షబాకుల కాయకష్టం మీద.పెరిగినోళ్లే..వాళ్ళకే మతిలేకపోతే ఎలా
Nijame..ikkada chiranjeevi /balakrishna akkada Ajith leka inka evarina
అజిత్ బహుముఖ ప్రజ్ఞాశాలి.
తండ్రి వారసత్వం లాంటివి లేకుండా ఎదిగిన నటుడు.
అంతకు మించి కులాల రొచ్చు లో దిగని మంచి మనిషి.
పైగా సైంటిఫిక్ టెంపర్ తో యూనివర్సిటీ లో సైన్స్ క్లబ్ లు కి స్పాన్సర్ గా కూడా చేశారు.
లైఫ్ లో కూడా నటన తో పాటు తనకి నచ్చిన క్రీడా రంగము లో కూడా ఎదుగుతున్నారు.
అతనికి తండ్రి వలన నటన లో కొనసాగుతూ,
కులం, మతం రొచ్చు లో ఈదులాడే విజయ కి పోలిక ఏంటీ?
ఏడిశావు లే …మరి మోడీ మతం రొచ్చులో లేడా