హిట్ లెక్కలన్నీ అబద్దాలే-ఎల్వీఆర్

గత రెండెళ్లుగా ఏ పంపిణీదారు కూడా కనీసం కమిషన్ కళ్ల చూడలేదని అన్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఒక్కటే తమకు కమిషన్ ఇచ్చిందన్నారు.

సీనియర్ సినిమా డిస్ట్రిబ్యూటర్, వెస్ట్ గోదావరికి చెందిన ఎల్వీఆర్, (ఎల్ వెంకటేశ్వరరావు) ఓ సంచలన విషయాన్ని వెల్లడించారు. గత రెండెళ్లుగా ఏ పంపిణీదారు కూడా కనీసం కమిషన్ కళ్ల చూడలేదని అన్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఒక్కటే తమకు కమిషన్ ఇచ్చిందన్నారు. రెండేళ్లుగా ఏ సినిమా కూడా కమిషన్ ఇచ్చే రేంజ్ హిట్ కాలేదని క్లారిటీ గా చెప్పారు. అయినా కూడా ఏ పంపిణీ దారు బయటకు చెప్పలేమని, చెబితే, ఆ నిర్మాత తరువాత సినిమా తమకు ఇవ్వరని వెల్లడించారు.

గడచిన రెండేళ్లలో అనేక పెద్ద, మీడియం, చిన్న సినిమాలు హిట్ అయ్యాయి. చాలా పెద్ద సినిమాలు భారీ భారీ. అంకెలు వేసారు. పోస్టర్లు వేసారు. ప్రకటనల ఇచ్చారు. కానీ సీనియర్ పంపిణీదారు ఎల్వీఆర్ మాత్రం అంతా వట్టిదే అంటున్నారు. తాము ఏదీ పైకి చెప్పలేమని, చెబితే తమకు తరువాత సినిమా పంపిణీకి ఇవ్వరని, అందువల్ల నష్టాలు వచ్చినా నవ్వుతూ లాభాలు వచ్చినట్లు చెప్పాల్సి వస్తోందన్నారు.

అదే విధంగా గత రెండేళ్లుగా ఏ జిల్లా కలెక్షన్లు కూడా బయటకు తెలియనివ్వకుండా బయ్యర్లను కట్టడి చేస్తున్నది వాస్తవం అని ఎల్వీఆర్ చెప్పారు. తాము ఏమీ చేయలేని స్థితిలో వున్నామని ఆయన వెల్లడించారు.

ఇలాంటి సమయంలో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ కలెక్షన్లు బయటకు సరిగ్గా రాకుండా నిర్మాతలు కట్టడి చేస్తున్న విషయాన్ని జర్నలిస్ట్ లే ప్రశ్నించాలని అన్నారు. తమకు మొహమాటాలు వుంటాయని, తాము ఏమీ చెప్పలేమని, అందువల్ల జర్నలిస్ట్ లే ఆ పని చేయాలని అన్నారు.