‘మహా’ ‘బ్యాచులర్’ ‘పెళ్లి’

ముగ్గురు దర్శకులు..మూడు సినిమాలు. ఒకరి ఖాతాలో మరుపురాని సినిమా వుంది. కానీ సినిమా చేసి చాలా కాలం అయింది. మరో డైరక్టర్ ఖాతాలో బ్లాక్ బస్టర్ వుంది. కానీ రెండో సినిమా చేయడానికి ఇంతకాలం…

ముగ్గురు దర్శకులు..మూడు సినిమాలు. ఒకరి ఖాతాలో మరుపురాని సినిమా వుంది. కానీ సినిమా చేసి చాలా కాలం అయింది. మరో డైరక్టర్ ఖాతాలో బ్లాక్ బస్టర్ వుంది. కానీ రెండో సినిమా చేయడానికి ఇంతకాలం పట్టింది. 

ముచ్చటగా డైరక్టర్ సీనియర్. కానీ ఆయన మెగా ఫోన్ పట్టుకునే చాలా కాలం అయింది. ఇప్పుడు కూడా చేస్తున్నది సూపర్ విజన్ మాత్రమే. ఆ ముగ్గురూ…బొమ్మరిల్లు భాస్కర్..అజయ్ భూపతి…కె రాఘవేంద్రరావు.

బొమ్మరిల్లు భాస్కర్ సినిమా చేసి చాలా కాలం అయింది. అలాంటి డైరక్టర్ ఓ మాంచి రొమాంటిక్ లవ్ స్టోరీని కొత్త యాంగిల్ లో చెప్పాలనే ప్రయత్నమే 'బ్యాచులర్'. చిరకాలంగా హిట్ కోసం చూస్తున్న అఖిల్ హీరో. క్రేజీ హీరోయిన్ ఫూజా హెగ్డే ఈ సినిమా కు కీలకం. బోలెడు మంది గెస్ట్ హీరోయిన్లు యాడెడ్ అట్రాక్షన్. ఇప్పటికే బాగా పాపులర్ అయిన 'లెహరాయి' సాంగ్ ఓ పుల్లింగ్ ఫ్యాక్టర్. గీతా సంస్థ నుంచి వస్తోంది కాబట్టి మినిమమ్ వుంటుందనే భరోసా. ఏమైనా ఈ సినిమా హిట్ డైరక్టర్ భాస్కర్ కు చాలా అవసరం.

ఆర్ఎక్స్ 100 లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన అజయ్ భూపతి రెండో సినిమా మహాసముద్రం. శర్వానంద్, సిద్దార్ధ, అదితి రావ్ హైదరి, అను ఇమ్మాన్యుయేల్, రావు రమేష్, జగపతిబాబు లాంటి స్టార్ కాస్ట్. ఎమోషనల్ కంటెంట్ పీక్స్ లో టచ్ చేసిన రెండు ట్రయిలర్లు. 

అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమా మీద మంచి అంచనాలు వున్నాయి. కేవలం ఓ లవ్ స్టోరీగా కాకుండా అనేక అంశాలు మిక్స్ చేసిన సినిమా ఇది. అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలు వున్నాయి. దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమా హిట్ కొడితే సెకెండ్ లీగ్ లోకి వెళ్తారు. 

ఎంతో మంది హీరోలతో ఎన్నో హిట్ సినిమాలు అందించిన దర్శకుడు రాఘవేంద్రరావు సినిమా పెళ్లి సందD.మెగా ఫోన్ వదిలేసిన ఆయన దర్శకత్వ పర్యవేక్షణ చేస్తూ గౌరి రోణంకిని దర్శకురాలిగా పరిచయం చేస్తున్నారు. పైగా ఈ సినిమాలో ఆయన నటిస్తున్నారు. 

ఆయన హీరోగా ఆయన మీదే సినిమా ఫ్లాష్ బ్యాక్ లో రన్ అవుతుందని తెలుస్తోంది. కీరవాణి-చంద్రబోస్ కాంబినేషన్ లో పాటలు ఇప్పటికే బాగా పాపులర్ అయ్యాయి. అదే ఈ సినిమాకు క్రేజీ పాయింట్.  దర్శకుడిగా తన అభిరుచి, టాలెంట్ ఇంకా అలాగే వున్నాయని రాఘవేంద్రరావు నిరూపించుకోవాల్సిన సినిమా ఇది. 

ఇలా మొత్తం మీద మూడు సినిమాలు ముగ్గురు దర్శకులకు చాలా కీలకం. కానీ అదే సమయంలో ముగ్గురు హీరోలకు కూడా కీలకమే. హిట్ కోసం చూస్తున్నాడు అఖిల్. ఫ్లాపుల్లో వున్నాడు శర్వానంద్. హీరోగా డెబ్యూ మూవీ రోషన్ కు. సో ఈ ముగ్గురికి కూడా సినిమాలు హిట్ కావడం చాలా అవసరం.

దసరా బరిలో దిగుతున్న ఈ సినిమాల భవిత ఎలా డిసైడ్ చేస్తారో ప్రేక్షకులు చూడాలి.