మారుతి నగర్ వెనుక..

సుకుమార్ రైటింగ్స్ సంస్థలో సినిమాలు వస్తున్నాయ్. శిష్యులను దర్శకులు చేస్తూ సుకుమార్ సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. అయితే, సుకుమార్ భార్య తబిత పేరు ఎప్పుడూ పోస్టర్ మీద పడలేదు. రావు రమేష్ ప్రధాన పాత్రలో…

సుకుమార్ రైటింగ్స్ సంస్థలో సినిమాలు వస్తున్నాయ్. శిష్యులను దర్శకులు చేస్తూ సుకుమార్ సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. అయితే, సుకుమార్ భార్య తబిత పేరు ఎప్పుడూ పోస్టర్ మీద పడలేదు. రావు రమేష్ ప్రధాన పాత్రలో నటించిన ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ సుకుమార్ వైఫ్ తబిత సమర్పణలో విడుదలవుతోంది. ఆగస్టు 23న సినిమా విడుదల సందర్భంగా దర్శకుడు లక్ష్మణ్ కార్య ఆవిడ సినిమాలోకి ఎలా వచ్చారో చెప్పారు.

‘నా వైఫ్, తబితా సుకుమార్ ఫ్రెండ్స్. ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ షూటింగ్ అంతా పూర్తి అయ్యాక ఓసారి తబిత కు సినిమా గురించి చెప్పమని మా ఆవిడను రిక్వెస్ట్ చేశా. తను చెప్పడంతో సినిమా గురించి తెలుసుకున్నారు. సుకుమార్, తబిత పిలిచి మాట్లాడారు. ప్రమోషన్స్ బాగా చేయమన్నారు. ఆవిడకు ప్రివ్యూ వేశా. విపరీతంగా నచ్చింది. సినిమా చూసినంత సేపూ నవ్వుతూనే ఉన్నారు. ఆవిడతో పాటు మైత్రి శశి కూడా సినిమా చూశారు. ఆయనకూ నచ్చింది. అలా తబిత సమర్పణలో మైత్రి సంస్థ విడుదల చేయడానికి ముందుకు వచ్చింది” అని లక్ష్మణ్ కార్య చెప్పారు.

కథ రాసిన తర్వాత హీరో పాత్రకు రావు రమేష్ అయితే బావుందని అనుకోగా… ‘కెజిఎఫ్’, ‘పుష్ప’ వంటి పాన్ ఇండియా హిట్స్ చేసిన ఆయన చిన్న సినిమా చేసే అవకాశం లేదని కొందరు చెప్పారని, కానీ 20 నిమిషాల కథ విని ఓకే చేశారని లక్ష్మణ్ కార్య తెలిపారు. మధ్య తరగతి కుటుంబ పరిస్థితులు, తండ్రి కొడుకుల అనుబంధం ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకుంటుందని ఆయన అన్నారు. వినోదం ఎక్కువ అందించినా పతాక సన్నివేశాలు భావోద్వేగానికి గురి చేస్తాయని లక్ష్మణ్ కార్య చెప్పారు. ఇంద్రజ క్యారెక్టర్ సర్‌ప్రైజ్ చేస్తుందన్నారు.

5 Replies to “మారుతి నగర్ వెనుక..”

    1. ఇంకొంచెం వివరంగా చెబితే గిట్టుబాటు అవుతుంది.

      ఏమైనా కావాలంటే నా దగ్గరకి రాండి…మంచి ట్రీట్మెంట్ వుంది.

Comments are closed.