ఫ్యాన్స్ మట్లాడుతున్నారు.. గమనించండి

హీరో రామ్, హీరో రవితేజ‌ సినిమాల సెలక్షన్ విషయంలో వారి వారి అభిమానులు చాలా బాధపడుతున్నారు.

సాధారణంగా ఫ్లాప్ సినిమా ఇచ్చినా హీరోను వెనకేసుకుని వస్తారు అభిమానులు. ఎందుకంటే వారి అభిమానం అలాంటిది. కానీ ఈవారం విడుదలైన రెండు సినిమాల విషయంలో అభిమానులే గొంతు విప్పి మాట్లాడుతున్నారు. ఏందీ సినిమాలు అని సుతిమెత్తగా నిలదీస్తున్నారు. హీరో రామ్, హీరో రవితేజ‌ సినిమాల సెలక్షన్ విషయంలో వారి వారి అభిమానులు చాలా బాధపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా బాధను వ్యక్తం చేస్తున్నారు.

వరుసగా ఫ్లాపులు ఇస్తూ వస్తున్నారు రవితేజ‌, రామ్ ఇద్దరూ. రవితేజ‌కు క్రాక్, ధమాకా తప్ప మరో హిట్ లేదు. ఈ రెండు సినిమాలకు అటు ఇటు పది వరకు ఫ్లాపులు. నిర్మాతలు, బయ్యర్లు కోట్లకు కోట్లు నష్టపోయారు. రవితేజ‌ మాత్రం సినిమా సినిమాకు తన రెమ్యూనిరేషన్ పెంచుకుంటూ వెళ్తున్నారని టాక్ వుంది. ప్రస్తుతం రవితేజ‌ 25 కోట్ల వరకు రెమ్యూనిరేషన్ తీసుకుంటారని టాలీవుడ్ టాక్. గమ్మత్తేమిటంటే నిర్మాతలు కుదేలు అవుతున్నా, మరో నిర్మాత ఎవరో ఒకరు డబ్బులు పట్టుకుని రెడీ అవుతున్నారు. ఫ్యాన్స్ ఇప్పుడు ఏకంగా సోషల్ మీడియాలో ఓపెన్ లెటర్లు పెడుతున్నారు.

ఇక హీరో రామ్ సంగతి కూడా అలాగే వుంది. రామ్ రాంగ్ ప్లానింగ్ చేసుకుంటున్నారు. యంగ్ హీరోలను మాస్ పాత్రల్లో జ‌నాలు చూడడం లేదు. కానీ రామ్ పది మందిని కొట్టేసే మాస్ పాత్రలు మాత్రమే కోరుకుంటున్నారు. రామ్ కు హిట్ లు వచ్చిన మంచి ఎంటర్ టైన్ మెంట్ లవ్ స్టోరీలను పక్కన పెట్టేసారు. అవుట్ అండ్ అవుట్ మాస్ సినిమాల వైపు మాత్రమే చూస్తున్నారు. అలాంటి సబ్డెక్ట్ లే కావాలనుకుంటున్నారని తెలుస్తోంది. ఫ్యాన్స్ ‘నేను శైలజ‌’ లాంటి సినిమాలు గుర్తుచేసుకుని అలాంటి సినిమాలు చేయవచ్చు కదా కోరుతున్నారు.

ఎన్ని ఫ్లాపులు వచ్చినా రవితేజ‌ విషయంలో ఫ్యాన్స్ పెదవి విప్పలేదు ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు బచ్చన్ సినిమా వారికి ఇచ్చిన షాక్ మామూలుది కాదు. చేయకూడదు అనుకున్న రైడ్ సినిమా రీమేక్ ను కేవలం దర్శకుడు హరీష్ శంకర్ ను నమ్మి చేసాడు. అదే ఇప్పుడు కొంప ముంచింది.

ఇవన్నీ ఇలా వుంచితే రాను రాను రవితేజ‌ సినిమాల మార్కెట్ తగ్గుతోంది. చాలా ఏళ్ల క్రితం పవర్ సినిమా టైమ్ లో థియేటర్ హక్కులకు ముఫై కోట్లు వుంటే ఇప్పుడూ అంతే వుంది. ఓటిటి హక్కుల మొత్తం రాను రాను తగ్గుతోంది. బచ్చన్ సినిమాకు వచ్చిన డిజిటల్ హక్కుల మొత్తం చాలా తక్కువ అని టాక్ వుంది.

దీని వల్ల రాబోయే సినిమాల బేరాలు కూడా అలాగే వుంటాయి. ఒక్క హిట్ అయినా అర్జంట్ గా పడాల్సి వుంది. లేదంటే చేతిలోకి సినిమాలు రావడమే కష్టం కావచ్చు. అప్పుడు అభిమానులు మరింత బాధపడతారు.

10 Replies to “ఫ్యాన్స్ మట్లాడుతున్నారు.. గమనించండి”

  1. Annitlonu velu pedithe ilane vuntundhi, anavasaramayina politics lo ki involve chesukoni mana vadu CM avuthadu manam pandaga chesukovachu Ane dhuredhesam tho avathala vunna politician ni ammana Bhoothulu thittaru,vaadiki abhimanulu vuntaru vurukuntara?-ve pracharam chestharu.

Comments are closed.