ఇప్పుడు టాలీవుడ్ లో కొంతమంది హీరోలు చాలా తెలివిగా ప్లాన్ చేస్తున్నారు. మంచి కథ సంపాదిస్తే చాలు..టెక్నికల్ ప్యాడింగ్ పెట్టి సినిమాను చేసుకోవచ్చు.
జస్ట్ ఆ మాత్రం..ఈ మాత్రం తెలిసిన దర్శకుడు వుంటే సరిపోతుంది. హీరోతో సమానంగా పారితోషికం అడిగే దర్శకుడు వుంటే బడ్జెట్ పెరిగిపోతుంది. దాని బదులు తాము రెమ్యూనిరేషన్ పెంచుకోవచ్చు. ఇలా వుంది ఒకరిద్దరు హీరోల ఆలోచన. అందుకే వాళ్లు ఎక్కువగా కొత్తవారితోనే సినిమా చేస్తుంటారు. తాము ఇరవై కోట్లు, ఇరవై అయిదు కోట్లు తీసేసుకుంటారు రెమ్యూనిరేషన్ కింద.
ఈ హీరోల సంగతి ఇలా వుంటే మెగాస్టార్ చిరు ఆలోచన వేరుగా వుంది. కాస్త యావరేజ్ డైరక్టర్ వుంటే చాలు. తన ఆలోచనలు, తన అనుభం, తనతో వుంటే టీమ్ ఇన్ పుట్స్ తో బండి లాగించేయవచ్చు అన్నది ఆయన ఆలోచనగా తెలుస్తోంది.
ఇప్పటికే రెండు మూడు లైన్లు ఓకె చేసి పెట్టారు. కానీ వాటికి దర్శకులు కావాలి. బివిఎస్ రవి చెప్పిన కథ ను ఓకే చెసారు. దానికి దర్శకుడి కోసం వెదుకుతున్నారు. అలాగే మరో రచయిత చెప్పిన కథ విని సెలక్ట్ చేసి వుంచారు.
బింబిసార దర్శకుడు చెప్పిన లైన్ విని ఓకె చేసారు. అది డెవలప్ చేయమన్నారు. ఈసారి నిర్మాతలుగా కూడా పాపులర్ టాప్ బ్యానర్ ల కాకుండా కొత్తగా బిజీ అవుతున్న బ్యానర్ల వైపు చూస్తున్నారు మెగాస్టార్. తనే స్వయంగా పిలిచి మరీ ఆఫర్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకులు తెచ్చిన కథల కన్నా, కథకులు తెచ్చిన కథల వైపే మెగాస్టార్ మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది.