మొత్తానికి..షూటింగ్ లు బంద్

టాలీవుడ్ లో ఓ కొత్త అంకం ప్రారంభమైంది. మొత్తం షూటింగ్ లు నిలిచిపోయాయి. నిలిపేయాలని టాలీవుడ్ అత్యధిక బాడీ అయిన ఛాంబర్ నిర్ణయం తీసుకుంది. మళ్లీ ఎప్పుడు అన్న దానికి సమాధానం లేదు. అది…

టాలీవుడ్ లో ఓ కొత్త అంకం ప్రారంభమైంది. మొత్తం షూటింగ్ లు నిలిచిపోయాయి. నిలిపేయాలని టాలీవుడ్ అత్యధిక బాడీ అయిన ఛాంబర్ నిర్ణయం తీసుకుంది. మళ్లీ ఎప్పుడు అన్న దానికి సమాధానం లేదు. అది రేపు అయినా కావచ్చు..మరెంత దూరమైనా కావచ్చు. 

ఇప్పటి వరకు ఐడెంటిఫై చేసిన సమస్యలకు పరిష్కారం కనుగొనాల్సి వుంటుంది. అదే విధంగా వాటి పరిష్కారానికి కొంతయినా చర్యలు తీసుకోవాల్సి వుంటుంది. అప్పుడు కానీ మళ్లీ మొదలు పెట్టడానికి వీలు వుండదు. అలా కాకుండా ఇలా బంద్ చేసి అలా మొదలుపెడితే మాత్రం ఇన్నాళ్లూ బంద్ ను వ్యతిరేకించిన వాళ్లంతా విమర్శలకు దిగే ప్రమాదం వుంది.

అయితే విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం ఈ బంద్ ఎన్నాళ్లో వుండదని వినిపిస్తోంది. ఈ నెలలో పెద్ద సినిమాలు పుష్ప 2, మహేష్-త్రివిక్రమ్ ప్రారంభం కావాల్సి వుంది. వాటికి ఏ ఆటంకం వుండబోదని వినిపిస్తోంది. ప్రస్తుతానికి గిల్డ్ వేసిన పలు కమిటీలు తరచు సమావేశం అవుతున్నాయి. 

ఈ కమిటీలు అన్నీ సమస్యల పరిష్కారాల మార్గాలు సూచించిన తరువాత వాటిని ఎలా అమలు చేయాలి అన్నది గిల్డ్ లో డిస్కస్ చేస్తారు. ఆ మేరకు తీసుకునే నిర్ణయాలను మళ్లీ ఛాంబర్ కూడా అమలు చేయాల్సి వుంటుంది.

మొత్తం మీద ప్రస్తుతానికి షూటింగ్ లు ఆగిపోతాయి. కానీ మరో వారం పది రోజుల వరకు పెద్దగా షెడ్యూలు చేసిన సినిమాలు ఏవీ లేవు. అందువల్ల సమస్య కాబోదు. దిల్ రాజు – వంశీ పైడిపల్లి – విజయ్ సినిమా షూట్ షెడ్యూలు విశాఖ్ లో ఈ నెల మూడు నుంచి ప్రారంభం కావాల్సి వుంది. అది తమిళ సినిమా కానుక‌ మన నిర్మాత అయినా రూలు వర్తించదేమో అన్న కామెంట్లు వినిపించడం అదనపు సమాచారం.