మైత్రీ సినిమా వుంటుందా?

చిరకాలంగా వినిపిస్తున్న సినిమా ఒకటి వుంది. ప్రభాస్..హృతిక్ రోషన్…సిద్దార్ద్ ఆనంద్ కాంబినేషన్ లో వార్ 2. కానీ వార్ సినిమా పార్ట్ వన్ నిర్మాతలు మైత్రీ మూవీస్ కాదు. పార్ట్ 2 మరి వీళ్ల…

చిరకాలంగా వినిపిస్తున్న సినిమా ఒకటి వుంది. ప్రభాస్..హృతిక్ రోషన్…సిద్దార్ద్ ఆనంద్ కాంబినేషన్ లో వార్ 2. కానీ వార్ సినిమా పార్ట్ వన్ నిర్మాతలు మైత్రీ మూవీస్ కాదు. పార్ట్ 2 మరి వీళ్ల దగ్గరకు ఎలా వస్తుందనే అనుమానం వుండనే వుంది. 

ఇలాంటి నేపథ్యంలో వార్ సినిమా పార్ట్ వన్ నిర్మాతలు యాష్ రాజ్ ఫిలింస్ వైపు నుంచి ఓ వార్త వచ్చింది. అధికారికంగా కాకపోయినా, తరుణ్ ఆదర్శ్ లాంటి హ్యాండిల్ నుంచి ఎన్టీఆర్..హృతిక్ కాంబినేషన్ లో యష్ రాజ్ సంస్థ అయ్యన్ ముఖర్జీ దర్శకత్వంలో సినిమా చేస్తోందని.

ఇది అటు సిద్దార్ధ్ ఆనంద్ కు షాక్. సినిమా మాది..బ్యానర్ మాది..సీక్వెల్ కూడ మాది అనే టైపులో యష్ రాజ్ సంస్థ ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. 

ఇప్పుడు సిద్దార్థ్ ఆనంద్ వేరే ప్రాజెక్టు చేయాలి ప్రభాస్..హృతిక్ లతో. వార్ 2 అయితే కాదు. అందువల్ల ఇది వుంటేనే మైత్రీ సంస్థ సినిమా వుంటుంది. లేదూ అంటే మరో ప్రాజెక్ట్ ను ప్రభాస్ కోసం సెట్ చేయాలి.

హృతిక్ తో ఎన్టీఆర్ ప్రాజెక్టు అన్న దాన్ని చాలా గోప్యంగా వుంచారు. దగ్గరగా వుంటే మైత్రీ సంస్ద అధినేతలకు కూడా అస్సలు ఉప్పు అందనివ్వలేదని తెలుస్తోంది. అది ఎందుకున్నది మాత్రం తెలియదు. మరి ఇప్పుడు మైత్రీ ఏం చేస్తారనన్నది చూడాలి ప్రభాస్ కోసం.