రావణాసుర ప్రేక్షకులకు షాక్ ఇస్తుంది

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్ నామా, రవితేజ గ్రాండ్ గా నిర్మించారు. హీరో సుశాంత్ కీలక పాత్ర…

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్ నామా, రవితేజ గ్రాండ్ గా నిర్మించారు. హీరో సుశాంత్ కీలక పాత్ర పోషించారు. ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్ గా సినిమా రిలీజ్ కాబోతున్న నేపధ్యంలో నిర్మాత అభిషేక్ నామా రావణాసుర విశేషాలని విలేకరులు సమావేశంలో పంచుకున్నారు.

రావణాసురకి కర్త కర్మ క్రియ మీరేనా?

లేదండీ. అంతా హీరో రవితేజ గారిది. ఆయనే కథని ఫైనల్ చేసి నన్ను పిలిచి సినిమా చేయమని చెప్పారు. రవితేజ కూడా ఇందులో ఒక నిర్మాత.

కథ విన్నపుడు ఎగ్జయిట్ చేసిన అంశాలు ఏమిటి?

ఇంతవరకూ రవితేజ ఇలాంటి సినిమా చేయలేదు. ఈ సినిమా చూసిన తర్వాత రవితేజ ఇలా కూడా చేయగలుగుతారా ? అని ప్రేక్షకులు షాక్ అవుతారు. కొత్త కాన్సెప్ట్ . ఇది వర్క్ అవుట్ అయితే హీరోలు ఇలాంటి మరిన్ని కథలు ప్రయత్నిస్తారు.

స్వంత విడుదలలో రిస్క్ వుంటుందా?

ఒక కథ నచ్చి, దానిపై నమ్మకంతోనే డబ్బుపెట్టాం. నమ్మకం వున్నపుడు వేరే వాళ్ళకి ఇవ్వడం ఎందుకు ? మేము నమ్మిన సినిమా మేమే విడుదల చేస్తున్నాం. కథ విన్నప్పడు నుంచే రావణాసుర పై నమ్మకంగా వున్నాం.

‘రావణాసుర’ కథ గురించి టీం లో ఎవరూ లీడ్ ఇవ్వలేదు. మీరు ఏం చెబుతారు ?

థ్రిల్లర్ జోనర్స్ చూసినప్పుడు షాకింగ్.. వావ్.. ఫ్యాక్టర్స్ వుంటాయి. అవి ముందే ఆడియన్స్ కి తెలిసిపోతే ఆ కిక్కు రాదు. అందుకే కథ గురించి బయటికి చెప్పలేదు.

ఈ సినిమా టైటిల్, డిజైన్స్ మీవే అంట కదా?

నేను ఫైన్ ఆర్ట్స్ నేపధ్యం నుంచి వచ్చాను. మంచి సినిమాలు చేయాలనే ఆసక్తి వుంటుంది. కాన్సెప్ట్ సినిమాలు చేయడం ఇష్టం.

రావణాసుర కి సీక్వెల్ వుంటుందా ?

ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తే సీక్వెల్ చేస్తాం. రావణాసుర కథకి ఆ అవకాశం వుంది.

శ్రీకాంత్ విస్సా ని దర్శకుడుగా లాంచ్ చేసే అవకాశం ఉందా ?

దర్శకుడిగా నా బ్యానర్ లోనే మొదటి సినిమా చేయాలని చెప్పాను. చేస్తానని కూడా అన్నారు.