సినిమా హాల్ లో మందు దొరికితే!

చాలామంది మందుబాబుల మనసులో మాటిది. ఎంచక్కా 2 గంటల పాటు సినిమా చూస్తూ, ఓ 2 బీర్లు లాగించేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది కదా అని చాలామంది ఆలోచించే ఉంటారు. అయితే ఇండియాలోని థియేటర్లలో ఆ…

చాలామంది మందుబాబుల మనసులో మాటిది. ఎంచక్కా 2 గంటల పాటు సినిమా చూస్తూ, ఓ 2 బీర్లు లాగించేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది కదా అని చాలామంది ఆలోచించే ఉంటారు. అయితే ఇండియాలోని థియేటర్లలో ఆ సదుపాయం లేదు. విదేశాల్లో మాత్రం ఉంది. ఇప్పుడిదే ఆలోచన దర్శకుడు నాగ్ అశ్విన్ కు కూడా వచ్చింది.

“సురేష్ బాబు, రానాతో ఓసారి మాట్లాడుతున్నప్పుడు.. థియేటర్లు లిక్కర్ లైసెన్స్ పొందితే ఎలా ఉంటుందనే టాపిక్ వచ్చింది. కొన్ని దేశాల తరహాలో థియేటర్లలో బీర్/బ్రీజర్/వైన్ అందుబాటులోకి వస్తే ఎలా ఉంటుంది. ఇది థియేటర్ల ఆక్యుపెన్సీని పెంచుతుందా.. థియేటర్ బిజినెస్ పెరుగుతుందా.. మీరేం అనుకుంటున్నారు. ఇది గుడ్ ఐడియానా.. బ్యాడ్ ఐడియానా?”

ఇలా ఉన్నది ఉన్నట్టు డైరక్ట్ గా ట్వీట్ చేశాడు నాగ్ అశ్విన్. అయితే ఆ వెంటనే అతడికి ఎదురుదెబ్బ కూడా తగిలింది. ఇది చాలా చెత్త ఐడియా అంటూ నెటిజన్లు విరుచుకుపడ్డారు. ఇలా చేస్తే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు పూర్తిగా దూరమైపోతారని అన్నారు. ఒక దశలో థియేటర్లలో విచ్చలవిడితనం పెరిగి రచ్చరచ్చ అయిపోతుందని చెప్పుకొచ్చారు.

ఈ సమాధానాలతో నాగ్ అశ్విన్ కూడా పూర్తిగా ఏకీభవించాడు. కానీ తన ఆలోచనను మాత్రం వెనక్కి తీసుకోలేదు. “అవును నిజమే.. థియేటర్లకు కుటుంబ ప్రేక్షకులు దూరమైపోతారు. అయితే కొన్ని మల్టీప్లెక్సుల్లోనైనా మద్యం పెట్టుకుంటే ఫర్వాలేదు కదా.” అంటూ మళ్లీ ప్రశ్నించాడు.

థియేటర్లకు జనాల రాక పెరగాలంటే ఏదో ఒకటి చేయాలని.. ఏం చేయాలో చెప్పమంటూ నాగ్ అశ్విన్ ప్రశ్నిస్తున్నాడు. ఈసారి నెటిజన్లు సానుకూలంగా స్పందించారు. స్క్రీన్స్ విద్ లిక్కర్, లిక్కర్ ఫ్రీ థియేటర్లు అంటూ కేటగిరీ చేసి పెడితే ఫలితం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఎక్కువ మంది మాత్రం సింపుల్ గా టిక్కెట్ రేట్లు తగ్గిస్తే సరిపోతుందని, ఆటోమేటిగ్గా ఫుట్ ఫాల్ పెరుగుతుందని సలహా ఇచ్చారు. 

ఇది మాత్రం బ్రహ్మాండమైన సలహా. కానీ అమలుకాదు. ఎందుకంటే ప్రేక్షకుల నుంచి  అదనంగా ఓ వంద గుంజుదామనే ప్రతి ఒక్కడు చూస్తుంటాడు తప్ప అదే ప్రేక్షకుడికి ఓ 10 రూపాయలు మిగులిద్దామనే ఆలోచన ఒక్కడు కూడా చేయడు. ఈ ఆలోచన విధానం మారనంతవరకు థియేటర్లకు జనాలు వెళ్లరు. 

విద్యుత్‌ బిల్లులపై ప్రతిపక్షం దుష్ప్రచారం