ఆర్థిక ఇబ్బందుల‌తో రూ.15 వేలకు ఆ న‌టి…

లాక్‌డౌన్ కార‌ణంగా షూటింగ్‌లు ఆగిపోవ‌డంతో గ్లామ‌ర్ రంగాన్ని న‌మ్ముకున్న వాళ్ల బ‌తుకులు ఇబ్బందుల్లో ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే దాదాపు రెండు నెల‌లుగా మ‌న దేశంలో బుల్లితెర‌, వెండితెర అనే తేడా లేకుండా అన్ని ర‌కాల షూటింగ్‌లు…

లాక్‌డౌన్ కార‌ణంగా షూటింగ్‌లు ఆగిపోవ‌డంతో గ్లామ‌ర్ రంగాన్ని న‌మ్ముకున్న వాళ్ల బ‌తుకులు ఇబ్బందుల్లో ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే దాదాపు రెండు నెల‌లుగా మ‌న దేశంలో బుల్లితెర‌, వెండితెర అనే తేడా లేకుండా అన్ని ర‌కాల షూటింగ్‌లు ఆగిపోవ‌డం తో ఓ మోస్త‌రు న‌టీన‌టులు, కార్మికులు క‌ష్టాలు ప‌డుతున్నారు. తాజాగా రూ.15 వేల‌కు మేక‌ప్ మ్యాన్ ద‌గ్గ‌ర ఓ న‌టి చేయి చాచ‌డం వెలుగులోకి వ‌చ్చింది. దీన్నిబ‌ట్టి వాళ్ల ఇబ్బందులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవ‌చ్చు.

నిర్మాత త‌న‌కివ్వాల్సిన డ‌బ్బు ఇవ్వ‌క‌పోవ‌డంతో, అవ‌స‌రాలు తీర్చుకోడానికి మేక‌ప్ మ్యాన్ ద‌గ్గ‌ర సిగ్గు విడిచి చేయి చాచాల్సి వ‌చ్చింద‌ని  స్వ‌యంగా బాధితురాలైన టీవీ న‌టి సోనాల్ వెంగ‌ర్లేక‌ర్ వెల్ల‌డించారు. త‌న‌కెదురైన ఇబ్బందుల‌ను ఆమె సోష‌ల్ మీడియా వేదిక‌గా ఏక‌రువు పెట్టారు.

సోనాల్ వెంగర్లేకర్ ప‌లు టీవీ సీరియ‌ల్స్‌లో న‌టించారు, న‌టిస్తున్నారు. లాక్ డౌన్ కార‌ణంగా త‌న వ‌ద్ద ఉన్న డ‌బ్బంతా ఖ‌ర్చుల‌కు అయిపోయిన‌ట్టు తెలిపారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచ‌క త‌న‌కు రావాల్సిన రెమ్యున‌రేష‌న్ రాబ‌ట్టేందుకు ఆలోచించిన‌ట్టు తెలిపారు. ఒక నిర్మాత‌కు ఫోన్ చేసి త‌న రెమ్యున‌రేష‌న్ ఇవ్వాల‌ని అడిగాన‌న్నారు. అయితే అత‌ను మొహం చాటేసిన‌ట్టు ఆమె వాపోయారు. కానీ త‌న ఇబ్బందులు అత‌నికి వ‌రుస‌గా ఫోన్ చేసేలా ప్రోత్స‌హించాయ‌న్నారు. దీంతో స‌ద‌రు నిర్మాత త‌న నంబ‌ర్‌ను బ్లాక్ చేశాడ‌ని ఆ న‌టి చెప్పుకొచ్చారు.

ఇక త‌న‌కు వేరే మార్గం క‌నిపించ‌లేదు. త‌న‌కు బాగా ప‌రిచ‌యం ఉన్న మేక‌ప్ మ్యాన్‌కు గోడు చెప్పుకున్నాన‌న్నారు. త‌న బాధ‌ను అర్థం చేసుకున్న మేక‌ప్ మ్యాన్ పంక‌జ్ గుప్తా మాన‌వ‌త్వంతో స్పందించార‌న్నారు. భార్య కాన్పు ఖ‌ర్చుల  కోసం దాచుకున్న రూ.15 వేలు త‌న‌కు అప్పుగా ఇచ్చాడ‌ని, తిరిగి డెల‌వ‌రీ స‌మ‌యానికి ఇవ్వాల‌ని కోరిన‌ట్టు ఆమె తెలిపారు. మేక‌ప్ మ్యాన్ మంచిత‌నానికి తాను క‌న్నీటిప‌ర్యంత‌మైన‌ట్టు సోష‌ల్ మీడియాలో టీవీ న‌టి ఓ పోస్ట్ పెట్టారు. అదిప్పుడు వైర‌ల్ అయింది. లాక్‌డౌన్ విప‌త్తులో ఎవ‌రిని క‌దిలించినా క‌న్నీళ్ల క‌థ‌లే. 

విద్యుత్‌ బిల్లులపై ప్రతిపక్షం దుష్ప్రచారం