కట్టుబాటు పక్కన పెట్టిన నాని

“మనసును బాగా కదిలించిన కథలతో సినిమాలు నిర్మిస్తా. ఏదో ఒక సినిమా నిర్మించి చేతులు దులుపుకొని వెళ్లిపోవాలనే ఉద్దేశం కాదు నాది. మంచి కథలు దొరికితే నేనే నిర్మిస్తా. కానీ అలా నిర్మించే సినిమాల్లో…

“మనసును బాగా కదిలించిన కథలతో సినిమాలు నిర్మిస్తా. ఏదో ఒక సినిమా నిర్మించి చేతులు దులుపుకొని వెళ్లిపోవాలనే ఉద్దేశం కాదు నాది. మంచి కథలు దొరికితే నేనే నిర్మిస్తా. కానీ అలా నిర్మించే సినిమాల్లో నేను మాత్రం నటించను.”

‘అ!’ సినిమా ప్రమోషన్ లో నాని చెప్పిన మాటిది. ఇన్నాళ్లూ అలానే చేశాడు. కానీ ఇప్పుడు తనే హీరోగా హిట్-3 ప్రకటించాడు. సొంత బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తాను తప్ప, నటించనని తెలిపిన నాని.. శైలేష్ కొలను చెప్పిన కథకు ఫ్లాట్ అయ్యాడు.

అందుకే శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్టును తాత్కాలికంగా పక్కనపెట్టి మరీ హిట్-3ని ముందుకు తీసుకొచ్చాడు. హిట్-1, హిట్-2 హిట్టవ్వడంతో.. ఈసారి నేరుగా తనే రంగంలోకి దిగాడు.

హిట్-ది థర్డ్ కేస్ సినిమాకు సంబంధించి ఈరోజు అధికారిక ప్రకటన వచ్చేసింది. వచ్చే ఏడాది మే 1న సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు.

ఈ సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ లో అర్జున్ సర్కార్ గా నానిని, కంప్లీట్ యాక్షన్ లుక్ లో చూపించాడు దర్శకుడు. యునానిమస్ ప్రొడక్షన్స్ తో కలిసి వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై నాని నిర్మించనున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీత దర్శకుడు.

12 Replies to “కట్టుబాటు పక్కన పెట్టిన నాని”

  1. సినిమా పేరు వల్ల అయినా నానికి హిట్ దొరుకుతుందేమో చూడాలి.

    సినిమా ఫలితం ఎలాగున్నా హిట్ సినిమాలో నటించాను అని నాని చెప్పుకోవచ్చు

Comments are closed.