నారీ నారీ నడుమ మురారి-హైందవ

సినిమాలకు టైటిల్ అందం. సినిమా మీద ఆసక్తి కలిగించేది, పెంచేది టైటిల్‌నే. అందుకే కొత్త కొత్త టైటిళ్ల కోసం చూస్తుంటారు కొందరు.

సినిమాలకు టైటిల్ అందం. సినిమా మీద ఆసక్తి కలిగించేది, పెంచేది టైటిల్‌నే. అందుకే కొత్త కొత్త టైటిళ్ల కోసం చూస్తుంటారు కొందరు. మరి కొందరు పాత క్రేజీ టైటిళ్లను రిపీట్ అంటారు. ఇద్దరు యంగ్ హీరోల సినిమాలకు టైటిళ్ల విషయంలో ఇలాంటి టెక్నిక్‌నే వాడుతున్నారు.

అనిల్ సుంకర నిర్మిస్తున్న శర్వానంద్ సినిమాకు “నారీ నారీ నడుమ మురారి” అనే టైటిల్ ఫిక్స్ చేసారు. “సామజవరగమన” సినిమా అందించిన దర్శకుడు ఈ సినిమాకు పని చేస్తున్నారు. ఈ సినిమా దాదాపు పూర్తయింది. త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రేపు వదులుతున్నారు.

కొత్త నిర్మాత మహేష్ చందు ఓ సినిమా నిర్మిస్తున్నారు. సుధీర్ బైరెడ్డి దర్శకుడు. ఈ సినిమాలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్. సోషియో ఫాంటసీ టచ్‌తో తయారవుతున్న ఈ థ్రిల్లర్‌కు “హైందవ” అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ఈ సినిమా ఇప్పుడిప్పుడే వర్క్ మొదలైంది. ప్రస్తుతానికి టైటిల్ గ్లింప్స్ మాత్రం ప్రకటిస్తున్నారు.

మొత్తానికి రెండు టైటిళ్లు ఆసక్తికరమైనవే. సినిమాలు ఎలా ఉంటాయో చూడాలి.

One Reply to “నారీ నారీ నడుమ మురారి-హైందవ”

  1. ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు… సీ బి పని

Comments are closed.