ప్రభాస్ లైనప్ లో కొత్త ట్విస్ట్

వరుసపెట్టి సినిమాలు చేస్తున్న ప్రభాస్, ప్రస్తుతం తన సినిమాలన్నింటినీ ఓ క్రమంలో పెట్టే పనిలో ఉన్నాడు. ఆల్రెడీ కమిట్ అయిన సినిమాల కాల్షీట్లన్నీ ఓ కొలిక్కి వచ్చిన తర్వాతే, మరికొన్ని సినిమాలు ప్రకటించే ఆలోచనలో…

వరుసపెట్టి సినిమాలు చేస్తున్న ప్రభాస్, ప్రస్తుతం తన సినిమాలన్నింటినీ ఓ క్రమంలో పెట్టే పనిలో ఉన్నాడు. ఆల్రెడీ కమిట్ అయిన సినిమాల కాల్షీట్లన్నీ ఓ కొలిక్కి వచ్చిన తర్వాతే, మరికొన్ని సినిమాలు ప్రకటించే ఆలోచనలో ఉన్నాడు.

ఇందులో భాగంగా ప్రభాస్ లైనప్ లో ఓ కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది. ఇన్నాళ్లూ అతడు ఒకేసారి 2 లేదా 3 సినిమాలు చేస్తూ వచ్చాడు. ఇకపై అలా చేయడానికి వీల్లేదు. దీనికి కారణం సందీప్ రెడ్డి వంగ.

ప్రభాస్ తో ‘స్పిరిట్’ సినిమా ప్రకటించిన సందీప్ రెడ్డి, ప్రస్తుతం ఆ మూవీ ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా సెట్స్ పైకి వచ్చే టైమ్ కు మరో సినిమా పని పెట్టుకోవద్దని ప్రభాస్ ను కోరాడు సందీప్.

‘స్పిరిట్’లో ప్రభాస్ లుక్ డిఫరెంట్ గా ఉంటుందట. ఒకేసారి 2-3 సినిమాలు చేస్తే లుక్ తో సమస్యలొస్తాయనేది దర్శకుడి బాధ. అందుకే తన సినిమా సెట్స్ పైకి వెళ్లేసరికి మరో సినిమా పని లేకుండా చూసుకోవాలని కోరాడట.

అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది సాధ్యమేనా అనేది అందరి డౌట్. ప్రస్తుతం రాజాసాబ్ నడుస్తోంది. మరో నెలన్నరలో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. హను రాఘవపూడి సినిమా (ఫౌజీ) కూడా సెట్స్ పైకి వచ్చింది. ఆ మూవీలో కూడా ప్రభాస్ ది డిఫరెంట్ గెటప్ అంటున్నారు.

సో.. నిజంగా సందీప్ కోరుకున్నట్టు ప్రభాస్ చేయాలంటే స్పిరిట్ సినిమా సెట్స్ పైకి రావడం ఇంకాస్త ఆలస్యం అవుతుంది. అందుకే వచ్చే ఏడాది జనవరి నుంచి కాకుండా, మరో 4 నెలలు ఆలస్యంగా వేసవి నుంచి రెగ్యులర్ షూట్ ప్లాన్ చేశారు.

3 Replies to “ప్రభాస్ లైనప్ లో కొత్త ట్విస్ట్”

Comments are closed.